AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej- Lavanya Tripathi: నాగబాబు ఇంట్లో దీపావళి వేడుకలు.. వరుణ్-లావణ్యల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్

మెగా బ్రదర్, నిర్మాత నాగబాబు ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. నాగ బాబు సతీమణి కుమారుడు వరుణ్ తేజ్, కోడలు లావణ్య త్రిపాఠి ఈ వేడుకల్లో భాగమయ్యారు. ఇటీవలే వరుణ్-లావణ్యలకు కుమారుడు పుట్టడంతో నాగబాబు ఫ్యామిలీకి ఈ దీపావళి మరింత స్పెషల్ గా మారింది.

Varun Tej- Lavanya Tripathi: నాగబాబు ఇంట్లో దీపావళి వేడుకలు.. వరుణ్-లావణ్యల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
Varun Tej, Lavanya Tripathi
Basha Shek
|

Updated on: Oct 21, 2025 | 8:10 PM

Share

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక సినీ ప్రముఖలు కూడా ఎంతో అట్టహాసంగా దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పటాకులు పేల్చి తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లోనూ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇటీవలే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీలకు కుమారుడు పుట్టడంతో నాగబాబు ఫ్యామిలీకి ఈ దీపావళి మరింత స్పెషల్ గా మారింది. ఈ సందర్భంగా నాగబాబు, ఆయన సతీమణి తమ మనవడిని ఎత్తుకుని సరదాగా ఫొటోలు దిగారు. అలాగే వరుణ్, లావణ్య కూడా తమ ముద్దుల తనయుడిని చూసి మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వరుణ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ ఫొటోల్లో ఎక్కడా వరుణ్, లావణ్యల ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

సెప్టెంబర్ 10న లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ఆ తర్వాత తమ ముద్దుల కుమారుడికి ఘనంగా బారసాల వేడుక కూడా నిర్వహించారు. ఇక ఇటీవలే దసరా పండగను పురస్కరించుకుని స్వయంగా వరుణ్ తేజ దంపతులే తమ కుమారుడిని అందరికీ పరిచయం చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ కుమారుడి ఫొటోలు షేర్ చేసిన లావణ్య- వరుణ్.. ‘ఆంజనేయ స్వామి దయతో పుట్టిన మా బాబుకు ‘వాయువ్‌ తేజ్‌ కొణిదెల’ అనే పేరు పెట్టాం. మీ అందరి దీవెనలు కావాలి’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

దీపావళి వేడుకల్లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి..

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజ్’ అనే హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక లావణ్య త్రిపాఠి అధర్వ మురళితో కలిసి నటించిన ‘టన్నెల్’ మూవీ ఈ సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. ఇటీవలే ఓటీటీలోకి కూడా వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది.

కుమారుడితో వరుణ్ తేజ్, లావణ్య..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి