మామ దూరమై 11ఏళ్లు.. ఆ రోజు చాలా ఏడ్చా..! ఉదయ్ కిరణ్ గురించి ఆయన మేనకోడలు
దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మనసంతా నువ్వే ఒకటి. 2001లో విడుదలైన ఈ మూవీ ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వీఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలో రీమాసేన్ హీరోయిన్ గా నటించింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ తనదైన ముద్ర వేశారు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ పేరు చెప్పగానే తెలియకుండానే గుండె బరువెక్కుతుంది. కళ్లు చెమ్మగిల్లుతాయి. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాల్లో మనసంతా నువ్వే సినిమాకు సపరేట్ ఫ్యాన్స్ ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గా నిలిచింది మనసంతా నువ్వే. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన అందమైన ప్రేమకథ. డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ 2001లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి.
అప్పట్లో ఊపేసింది..! 90’s కిడ్స్ ఫేవరెట్ యాంకర్.. ఈ అమ్మడు గుర్తుందా.?
ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ అప్పట్లో యూత్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరోహీరోయిన్లుగా నటించగా.. తనికెళ్ల భరణి, సునీల్, తనూరాయ్, చంద్రమోహన్ కీలకపాత్రలలో నటించారు. ఇప్పుడు ఈ సినిమా నేడు రి రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను మరోసారి థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మనసంతా నువ్వే చిత్రం ఫిబ్రవరి 14న( నేడు) థియేటర్లలో మళ్ళీ విడుదలైంది. కాగా మనసంతా నువ్వే సినిమా గురుంచి ఉదయ్ కిరణ్ మేనకోడలు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఎదురు కట్నమైనా ఇస్తా..! అమ్మాయిలో అలాంటి క్వాలిటీస్ ఉండాలి : జబర్దస్త్ నరేష్
ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి ఈ సినిమాతో తనకున్న ప్రత్యేక బంధాన్ని పంచుకున్నారు. ఆమె పుట్టిన రెండు నెలలకే మనసంతా నువ్వే విడుదలైందని, ఈ సినిమా తన లక్కీ మూవీ అని ఉదయ్ కిరణ్ తరచుగా చెప్పేవారని తెలిపారు మహతి. ఇప్పటివరకు 10-12 సార్లు సినిమాను చూశానని, అయితే థియేటర్‌లో చూసే అవకాశం లభించలేదని, అందుకే ఈ రీ-రిలీజ్‌కు తాను చాలా ఆత్రుతగా ఉన్నానని తెలిపింది. కేవలం ఈ సినిమాను చూడటానికే తాను హైదరాబాద్‌కు వచ్చానని మహతి వెల్లడించారు. సుదర్శన్ 35ఎంఎం థియేటర్‌లో సినిమాను చూడనున్నట్లు ఆమె అభిమానులకు తెలిపారు.
గూగుల్ నన్ను హిందువుని చేసింది.. కానీ నేను ముస్లిం అమ్మాయిని.. షాక్ ఇచ్చిన సీరియల్ బ్యూటీ
ఉదయ్ కిరణ్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఉదయ్ కిరణ్‌ను మామ అని పిలిచే మహతి, చిన్నప్పటి నుంచి ఆయన తన ఆదర్శమని చెప్పారు. షూటింగ్ నుంచి రాగానే మామకు హెడ్ మసాజ్‌లు చేయడం, కారులో డ్రైవింగ్ చేస్తూ జోకులు చెప్పడం వంటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు మహతి. ఉదయ్ కిరణ్ తన పట్ల చాలా పొసెసివ్‌గా ఉండేవారని తెలిపింది. చిన్నప్పుడు పోరు సినిమాలోని క్లైమాక్స్‌లో ఉదయ్ కిరణ్ చనిపోయే సన్నివేశాన్ని చూసి, నిజంగానే ఆయన చనిపోయారని భావించి ఏడ్చేశానని, అప్పుడు తన తల్లి ఉదయ్ కిరణ్‌కు ఫోన్ చేసి మాట్లాడించారని మహతి గుర్తు చేసుకున్నారు. ఔనన్నా కాదన్నా, గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలు తనకు ఇష్టమైనవని చెప్పారు. ఆయన మరణించినప్పుడు తనకు 13 ఏళ్లని, ఆ వార్తను జీర్ణించుకోవడం చాలా కష్టమైందని మహతి తెలిపారు. మామ దూరమైన 11 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఆయనను ప్రేమించడం, ఆయన సినిమాలను గుర్తు చేసుకోవడం తనకు హృదయాన్ని హత్తుకునే అనుభూతిని ఇస్తోందని మహతి అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




