యవ్వనంగా కనిపించాలంటే ఇది వాడాల్సిందే!
ప్రస్తుత కాలంలో విపరీతమైన కాలుష్యం, హార్డ్ వాటర్ సమస్యలు, చర్మాన్ని దెబ్బతీసే ఎండ తీవ్రత, ఒత్తిడి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇన్ని సవాళ్ల మధ్య మన చర్మం తన సహజమైన మెరుపును కోల్పోయి, చిన్న వయసులోనే ముడతలతో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి చాలామంది మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతూ ఫలితం లేక నిరాశ చెందుతుంటారు.
కానీ పూర్వం కొన్ని రాజకుటుంబాల వారు తమ చర్మసౌందర్యం కోసం ఓ రహస్య తైలాన్ని ఉపయోగించేవారట. దీనివల్ల చర్మం కాంతివంతంగా యవ్వనంగా ఉంటుందట. ఈ ఆధునిక ప్రపంచంలో మరోసారి ఆ తైలం సంచలనం సృష్టిస్తోంది. ఆయుర్వేద గ్రంథాలలో ‘చర్మ సంరక్షణామృతం’గా పిలువబడే ఆ నూనె.. కేవలం కొద్ది చుక్కలతోనే మీ ముఖంపై రాజసం ఉట్టిపడేలా చేస్తుందట. అదేంటో..దానినెలా ఉపయోగించాలో తెలుసుకుందాం. కుంకుమాది అనే పేరు సంస్కృత పదమైన ‘కుంకుమ’ నుంచి వచ్చింది. కుంకుమ అంటే కుంకుమపువ్వు లేదా కేసర్ అని అర్థం. పూర్వకాలంలో రాజకుటుంబీకులు తమ ముఖం ఎప్పుడూ కాంతివంతంగా, యవ్వనంగా ఉండటానికి ఈ తైలాన్ని ప్రధానంగా ఉపయోగించేవారు. ఇది చర్మ రంధ్రాలను మూసివేయకుండా, లోపలి నుంచి శుభ్రం చేసి సహజమైన మెరుపును అందిస్తుంది. జంతువులపై ఎటువంటి పరీక్షలు చేయకుండా, కేవలం ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారయ్యే ఈ నూనె ఇప్పుడు మళ్ళీ అందరి ఆదరణ పొందుతోంది.
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

