వైద్యసిబ్బంది నిర్లక్ష్యం..ఆరేళ్ల పసిప్రాణం బలి!
పండంటి బిడ్డ అనారోగ్యం నుంచి కోలుకుంటాడని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు మిగిలింది కడుపు కోత. వైద్య సిబ్బంది చేసిన ఒక చిన్న పొరపాటు, అభం శుభం తెలియని ఆరేళ్ల పసివాడి ఊపిరి తీసింది. అధిక మోతాదులో మత్తు మందు (Anesthesia) ఇవ్వడం వల్లే తమ బిడ్డ మరణించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ P3లో ఉన్న KB హెల్త్‌కేర్ సెంటర్‌కు ‘గర్వ్ కసానా’ అనే ఆరేళ్ల బాలుడిని MRI స్కాన్ కోసం కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. స్కాన్ చేసే క్రమంలో బాలుడు కదలకుండా ఉండేందుకు అక్కడి సిబ్బంది మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే, కొద్దిసేపటికే ఆ చిన్నారి స్పృహ కోల్పోయి మరణించాడు. మోతాదుకు మించి మత్తు మందు ఇవ్వడం వల్లే ఈ ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బిడ్డ మరణవార్త విన్న తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు నిరసనగా భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు పవన్ ఖతానా ఆధ్వర్యంలో బాధితులకు మద్దతుగా హెల్త్‌కేర్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆసుపత్రి సిబ్బంది అజాగ్రత్త ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

