AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadapa: విహారయాత్ర విషాదంగా మారింది.. రెప్పాపాటులో లోకాన్ని వీడిన హ్రిషిక

విహార యాత్ర విషాదంగా మారింది. కడప జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వారాంతంతో సరదాగా ప్రెండ్స్‌తో గడిపేందుకు వెళ్లిన ఓ యువతిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. ఎక్కడో కేరళ నుంచి వచ్చి.. తిరుపతి ఎంతో మంది మిత్రులను సంపాదించుకున్న ఆమె మృతితో కాలేజీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Kadapa: విహారయాత్ర విషాదంగా మారింది.. రెప్పాపాటులో లోకాన్ని వీడిన హ్రిషిక
Bike Accident
Ram Naramaneni
|

Updated on: Feb 15, 2026 | 3:13 PM

Share

విద్యార్థులు విహారయాత్ర విషాదంగా మారిన ఘటన  వైఎస్సార్‌ కడప జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో రెప్పపాటులో ఓ యువతి ప్రాణం పోయింది. అప్పటివరకు సంతోషంగా ఉన్న వారి ప్రయాణం ఒక్కసారిగా విషాదంగా మారింది. ఏర్పేడు మండల పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసర్‌)లో విశాఖపట్నంకు చెందిన ఠాగూర్‌రెడ్డి, కేరళకు చెందిన హ్రిషిక,  అనుగ్రహ అఖిల్, సుషీన్, భవ్యలు విద్యనభ్యసిస్తున్నారు. శనివారం ఉదయం వీరందరూ బైక్స్‌పై  తిరుపతి నుంచి గండికోటకు బయలుదేరారు. ఈ క్రమంలో మధ్యాహ్నం చెన్నూరు మండల పరిధిలోని ఇర్కాన్‌ సర్కిల్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీకొంది. ఈ క్రమంలో ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్న ఠాగూర్, అనుగ్రహ డివైడర్‌పై పడ్డారు. రోడ్డుపై పడిన రుషికాపై లారీ వెళ్లడంతో స్పాట్‌లోని మృతి చెందింది. దీంతో కాలేజ్‌లో విషాదం నెలకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us