AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహు-కేతు సంచారంలో మార్పు.. వివాహం, విదేశీ యోగం.. ఈ రాశులకు అతిపెద్ద శుభవార్తలు.!

Rahu Ketu horoscope: రాహువు, కేతువు గ్రహాలు మార్చి 29న మాఘ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాయని జ్యోతిష్య వర్గాలు చెబుతున్నాయి. ఈ సంచారం కొన్ని రాశుల వారికి ప్రత్యేక లాభాలను తీసుకురావొచ్చని భావిస్తున్నారు. విశేషమైన లాభాలు పొందనున్న ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాహు-కేతు సంచారంలో మార్పు.. వివాహం, విదేశీ యోగం.. ఈ రాశులకు అతిపెద్ద శుభవార్తలు.!
Rahu Ketu transit
Rajashekher G
|

Updated on: Feb 14, 2026 | 12:28 PM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహసంచారాలు ద్వాదశ రాశులవారి జీవితంపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాయని భావిస్తారు. ముఖ్యంగా కొన్ని ప్రధాన గ్రహాలు ఒక నక్షత్రం లేదా రాశి నుంచి మరొకదానికి సంచరించినప్పుడు అన్ని రాశుల వారిపై శుభ–అశుభ ఫలితాలు కనిపిస్తాయని చెబుతారు. అందులో ముఖ్యంగా రాహు, కేతు వంటి చాయాగ్రహాలకు జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యం ఉంది. ఇవి జాతకంలో బలహీన స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తి అనేక ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్వసిస్తారు. అదే శుభస్థానంలో ఉంటే అప్రతిహత విజయాలు, ఆర్థిక ప్రగతి కూడా సాధ్యమవుతుందని చెబుతారు. ఇప్పుడు ఈ రెండు గ్రహాలు మార్చి 29న మాఘ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాయని జ్యోతిష్య వర్గాలు చెబుతున్నాయి. ఈ సంచారం కొన్ని రాశుల వారికి ప్రత్యేక లాభాలను తీసుకురావొచ్చని భావిస్తున్నారు. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారికి ఈ సంచారం అనుకూలంగా ఉండే అవకాశముంది. ఆకస్మిక ధనలాభాలు కలగవచ్చు. ఖర్చులు తగ్గి ఆర్థిక స్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. మీ మాటతీరు ఆకర్షణీయంగా మారి, మీరు చేసే పనులకు ఇతరుల నుంచి ప్రశంసలు దక్కే అవకాశం ఉంది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఊహించని ప్రగతి కనిపించవచ్చు. ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాలకు ఇది అనుకూల సమయంగా మారొచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. వ్యక్తిగత, వృత్తి సంబంధాలు మరింత బలపడవచ్చు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ కాలం విజయాలను అందించగలదని చెబుతున్నారు. శత్రువులపై ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలతో పాటు మంచి అవకాశాలు ఎదురవుతాయి. ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఉండగా, ప్రేమ సంబంధాలు సంతోషాన్ని అందించవచ్చు.

మీన రాశి

మీన రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంపాదనను సులభంగా నిల్వ చేసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఖర్చులు తగ్గి బ్యాంకు బ్యాలెన్స్ పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలు బలపడే అవకాశం ఉండగా, కుటుంబ సభ్యుల ఆమోదంతో వివాహ యోగం కూడా కలగవచ్చు. విదేశీ ప్రయాణాలు ఆర్థికంగా లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇవి జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం, గ్రహస్థితులు, దశా–భుక్తులు వంటి అంశాలపై ఆధారపడి ఫలితాలు మారవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)