Tumbbad: హస్తర్ మళ్లీ వస్తున్నాడు.. తుంబాడ్ రీరిలీజ్‌లో ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్

మరాఠీ చిత్రం 'తుంబాడ్' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 2018లో అక్టోబర్ 12న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. సోహమ్ షా, హరీష్ ఖన్నా, జ్యోతి మల్షే, రుద్ర సోని, మాధవ్ హరి జోషి తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. పెద్ద ఆర్టిస్టులు, పెద్ద డైరెక్టర్, నిర్మాణ సంస్థ లేకపోవడంతో పెద్దగా ప్రమోషన్ లేకుండానే ఈ సినిమా విడుదలైంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన తుంబాడ్ రూ.13.6 కోట్లు రాబట్టింది

Tumbbad: హస్తర్ మళ్లీ వస్తున్నాడు.. తుంబాడ్ రీరిలీజ్‌లో ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
Tumbbad Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 14, 2024 | 9:05 PM

మరాఠీ చిత్రం ‘తుంబాడ్’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 2018లో అక్టోబర్ 12న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. సోహమ్ షా, హరీష్ ఖన్నా, జ్యోతి మల్షే, రుద్ర సోని, మాధవ్ హరి జోషి తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. పెద్ద ఆర్టిస్టులు, పెద్ద డైరెక్టర్, నిర్మాణ సంస్థ లేకపోవడంతో పెద్దగా ప్రమోషన్ లేకుండానే ఈ సినిమా విడుదలైంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన తుంబాడ్ రూ.13.6 కోట్లు రాబట్టింది. అంతేకాదు 64వ ఫిల్మ్ పేర్ అవార్డ్స్ వేడుకలో ఏకంగా 3 అవార్డ్స్ గెలుచుకుంది.అయితే ఈ సినిమా ఓటీటీకి వచ్చేసరికి చాలా మందికి రీచ్ అయింది. రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇప్పుడీ సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేశారు. శుక్రవారం (సెప్టెంబర్ 13) దేశ వ్యాప్తంగా పలు థియేటర్లలో తుంబాడ్ విడుదలైంది. సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ విడుదలైన ఈ సినిమాని జనాలు కూడా బాగానే ఆదరిస్తున్నారు. ఇంతకు ముందు థియేటర్లలో ఈ మాస్టర్ క్లాస్ సినిమా మిస్ అయిన వారు ఇప్పుడు థియేటర్లకు వచ్చి ఈ దృశ్య కావ్యాన్ని వీక్షిస్తున్నారు. సినిమాను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.అయితే ఇదే సందర్భంగా తుంబాడ్ సినిమా రెండో భాగాన్ని కూడా ప్రకటించారు మేకర్స్.

త్వరలోనే తుంబాడ్ 2.. అధికారికంగా ప్రకటించిన నిర్మాత షోహమ్ షా

తుంబాడ్ సినిమా రీ-రిలీజ్ అయిన తర్వాత, సినిమాపై పెట్టుబడి పెట్టిన నిర్మాతలలో ఒకరైన షోహమ్ షా ‘తుంబద్ 2’ని ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ‘తుంబాద్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాహి అనిల్ బారావే ‘తుంబద్ 2’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. రాహి అనిల్ బరావే ప్రస్తుతం రాజ్ DK ద్వారా బ్యాంక్రోల్ చేయబడిన వెబ్ సిరీస్ వన్ దర్శకత్వంలో బిజీగా ఉన్నారు. ‘తుంబాడ్’ చిత్రాన్ని రీ-రిలీజ్‌లో చూసిన చాలా మంది ఇది అద్భుత కళాఖండమని కొనియాడారు, అదే సంవత్సరం విడుదలైన ‘గల్లీబాయ్’ కాకుండా ‘తుంబాడు’ ఆస్కార్‌కు నామినేట్ అయ్యి ఉండాల్సింది. 2018లో విడుదలైన ‘తుంబాద్‌’ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే చిన్న సినిమా ట్యాగ్ కావడంతో అప్పట్లో నిర్మాతలకు పెద్దగా లాభాలు రాలేదు. అయితే ఇప్పుడు రీ-రిలీజ్‌లో ఈ సినిమా తొలిరోజే రెండు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందీ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్. మరి సీక్వెల్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆలోచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తుంబాడ్ ట్రైలర్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!