AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి చేసుకోను.. లివింగ్ రిలేషన్‌తో పిల్లల్ని కంటా..! నటి బోల్డ్ కామెంట్స్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి ఆతర్వాత హీరోయిన్ గా మారిన అందాల భామ ఆమె.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ లేక సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం హోస్ట్ గా పలు ఇంటర్వ్యూలు చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

పెళ్లి చేసుకోను.. లివింగ్ రిలేషన్‌తో పిల్లల్ని కంటా..! నటి బోల్డ్ కామెంట్స్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 22, 2025 | 10:11 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్స్ పెళ్లి చేసుకోకుండా సింగిల్ సింతకాయలు గా ఉంటున్నారు. నాలుగుపదుల వయసు దాటుతున్న పెళ్లిపేరు ఎత్తకుండా ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. సీనియర్ హీరోయిన్స్ మాత్రమే కాదు.. యంగ్ హీరోయిన్స్ కూడా పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.. పెళ్లి చేసుకోము అని తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ జీవితంలో పెళ్లి చేసుకోము అని చెప్పి షాక్ ఇచ్చారు. అలానే ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ కూడా జీవితంలో పెళ్లి చేసుకోను చెప్పింది. అంతే కాదు ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చింది.. పెళ్లి చేసుకోను కానీ పిల్లల్ని మాత్రం కంటా అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆ యంగ్ హీరోయిన్ ఎవరో కాదు..

ఇది కూడా చదవండి : అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మల్లో తేజస్వి మాదివాడ ఒకరు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఫెమస్ అయిన తేజస్వి మాదివాడ. ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో సోలో హీరోయిన్ గా నటించినా, ఆ తర్వాత సెకెండ్ ఫీమెల్ లీడ్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా కనిపించింది.బిగ్ బాస్ హౌజ్ లో లో అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైన తేజస్వి మదివాడ ప్రస్తుతం టీవీ షోలతో బిజీబిజీగా ఉంటోంది. అలాగే పలు సినిమా ఫంక్షన్లలోనూ సందడి చేస్తోంటోంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అమ్మడు. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నిత్యం తన లేటెస్ట్ క్రేజీ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏం సినిమారా అయ్యా..! మెంటలెక్కి పోవాల్సిందే.. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజస్వి పెళ్లి గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. అలాగే తనకు జీవితంలో పెళ్లి అనే ప్రస్తావన లేదు అని తెలిపింది.. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదు అని తెలిపింది.. అలాగే తొందరగా వయసు అయిపోతే బాగుండు అనిపిస్తుంది అని తెలిపింది తేజస్వి. అంతే కాదు పెళ్లి చేసుకోను కానీ పిల్లల్ని మాత్రం కంటాను.. పెళ్లి చేసుకోకుండా లివిన్ రిలేషన్ లో ఉంటా.. లివింగ్ రిలేషన్ లో ఉంటానని.. అలా పిల్లలను కంటా.. ఈ విషయంలో బాలీవుడ్ హీరోయిన్ సుస్మిత సేన్ తనకు ఆదర్శం అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తేజస్వి కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి : గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి