AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.. కొత్త కొత్త విషయాలతో పాటు.. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా చిటికలో సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. అలాగే గతంలో టిక్ టాక్ అనేది ఉండేది.. ఇండియాలో అది బ్యాన్ చేశారు. ఇక ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో చాలా మంది సందడి చేస్తున్నారు

గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
Tiktok Video
Rajeev Rayala
|

Updated on: Jun 19, 2025 | 9:53 AM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని అసలు టైం ఎలా అయిపోతుందో కూడా తెలియడం లేదు.. కొంతమంది యువత సగం జీవితం సోషల్ మీడియాతోనే గడిపేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాతో డబ్బులు సంపాదిస్తుంటే మారికొంతమంది మాత్రం.. సోషల్ మీడియాతో టైం పాస్ చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇప్పుడు చాలా బెటర్ అప్పట్లో టిక్ టాక్ అనేది ఇండియాను షేక్ చేసింది. టిక్ టాక్ వీడియోలు చేసి చాలా మంది పాపులర్ అయ్యారు. అలాగే టిక్ టాక్ పిచ్చి వల్ల చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దాంతో టిక్ టాక్ బ్యాన్ చేశారు. కానీ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ పుణ్యమా అని మళ్లీ ఈ రచ్చ మొదలైంది. చాలా మంది ఇన్ స్టా రీల్స్ వల్ల పాపులర్ అవుతున్నారు. అలాగే గతంలో టిక్ టాక్ టైం లో పాపులర్ అయిన వీడియోలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఓ అమ్మాయికి సంబందించిన  వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..? చిన్న వీడియోతో అప్పట్లో టిక్ టాక్ ను షేక్ చేసింది. అప్పట్లో విపరీతంగా ట్రెండ్ అయ్యింది ఆ అమ్మాయి వీడియోలో.. తన క్యూట్ నెస్ తో టిక్ టాక్ యూజర్స్ ను ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి ఓల్డ్ వీడియోను మరోసారి షేర్ చేయగా.. ఆమె ఎవరు అనేది కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

కొంతమంది నెటిజన్స్ ఆ అమ్మాయి ఎవరు.? ఇప్పుడు ఎలా ఉంది.? అంటూ కామెంట్స్ చేయగా.. మరికొంతమంది నెటిజన్స్ ఆమె డీటైల్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ అమ్మయి పేరు ప్రీతీ పగడాల అని.. ఆమె ఇన్ స్టా ఐడీని కామెంట్స్ లో షేర్ చేస్తున్నారు. ఇంతకూ ఈ ప్రీతీ పగడాల ఎవరు అంటూ.. ఈ అమ్మడు ఎదో కోడి గుడ్డు మోటివేషన్ అంటూ వీడియోలు చేసేది. అలాగే రీల్స్ చేసి పాపులర్ అయ్యింది. తన అందంతో.. క్యూట్ ..క్యూట్ మాటలతో నెటిజన్స్ ను ఆకట్టుకుంది. అయితే ఆ టిక్ టాక్ అమ్మాయి.. ఈ అమ్మాయి ఒక్కరే అని కొందరు అంటుంటే.. కాదు ఆమె వేరు.. ఈమె వేరు అని మరికొందరు అంటున్నారు. అవునో కాదో మీరే చూసి చెప్పండి..

ప్రీతీ పగడాల ఇన్ స్టా గ్రామ్..

Follow Us