AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : దొరికేసింది మావ..! చిరంజీవితో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసేది ఈ అమ్మడే..

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి హిట్ తర్వాత చిరంజీవి నటించిన బోళాశంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Chiranjeevi : దొరికేసింది మావ..! చిరంజీవితో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసేది ఈ అమ్మడే..
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2025 | 12:30 PM

Share

మెగాస్టార్ చిరంజీవి.. జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. బోళాశంకర్ లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత చిరంజీవి ఇప్పుడు విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సోసియో-ఫాంటసీ కాన్సప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వశిష్ట. . యూవి క్రియేషన్స్ బ్యానర్‌పై వి. వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిరంజీవి, ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారని అంచనా. ఈ సినిమాలో ఆయన సరికొత్త అవతారంలో దర్శనమిస్తారని, హనుమాన్ భక్తుడిగా ఉండే పాత్రలో నటిస్తున్నారని టాక్. ఇక ఈ సినిమాలో త్రిష కృష్ణన్, అషికా రంగనాథ్, రమ్య పసుపులేటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఇప్పటికే సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అలాగే ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించనున్నారు. అదేవిధంగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే విశ్వంభర సినిమాలో భీమ్స్ ఓ స్పెషల్ సాంగ్ కు కంపోజ్ చేయనున్నారని ఇప్పటికే టాక్ వినిపిస్తుంది. సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఒక్క స్పెషల్ సాంగ్ కు మాత్రం భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది.

ఇక ఈ స్పెషల్ సాంగ్ కోసం కన్నడ బ్యూటీని రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు అందాల భామ నిశ్వికా నాయుడు. ప్ర‌భుదేవాతో క‌లిసి ‘హిత‌ల‌కా క‌రిబ‌య‌డా మావ‌’ అంటూ సోష‌ల్ మీడియాను ఊపేసింది. ఈ సాంగ్ తో ఈ అమ్మడు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మెగాస్టార్ కోసం ఆమెను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీని పై పూర్తి క్లారిటీ రానుంది.

View this post on Instagram

A post shared by Nishvika Naidu (@nishvika_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్