AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా శరీరం నా ఇష్టం.. మీకు నొప్పేందుకు..! స్టార్ హీరోయిన్ కామెంట్స్‌తో సోషల్ మీడియా షేక్

సింగర్‎గా సినీరంగ ప్రవేశం చేసి టాప్ హీరోయిన్‏గా క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. కెరీర్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్న ఈ ముద్దుగుమ్మ నిజ జీవితంలో మాత్రం ఒడిదుడుకులు తప్పడం లేదనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బ్యూటీకి ప్రేమ విషయాలు అంతగా కలిసిరావడం లేదనిపిస్తుంది.

నా శరీరం నా ఇష్టం.. మీకు నొప్పేందుకు..! స్టార్ హీరోయిన్ కామెంట్స్‌తో సోషల్ మీడియా షేక్
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2025 | 7:48 AM

Share

ఆమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.. సినీ ఇండస్ట్రీలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి స్టార్ హీరోలు, హీరోయిన్లుగా ఎదిగిన వారు చాలామందే ఉన్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. తండ్రి దిగ్గజ నటుడు. తల్లి కూడా ప్రముఖ నటినే. దీంతో సినిమా ఇండస్ట్రీలోకి త్వరగానే ఎంట్రీ లభించింది. తండ్రితో కలిసి ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈ క్యూటీ ఆ తర్వాత హీరోయిన్ గా కూడా సత్తా చాటింది. హీరోయిన్ గా నటిస్తూనే సింగర్ గానూ సత్తా చాటింది. అయితే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఈ ముద్దుగుమ్మకు అదృష్టం కలిసి రాలేదు.. కానీ ఆతర్వాత సత్తార్ హీరోయిన్ గా ఎదిగింది.. వరుసగా హిట్స్ అందుకుంది. ఇటీవలే పాన్ ఇండియా హిట్ కూడా అందుకుంది ఈ చిన్నది. కాగా తాజాగా ఈ చిన్నది చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకూ ఆమె ఎవరంటే..

మరెవరో కాదు లోక నాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శ్రుతి హాసన్. అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే కెరీర్ బిగినింగ్ లో వరుసగా ఫ్లాప్స్ అందుకుంది. ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి ఓ సినిమా చేసిందో ఈ ముద్దుగుమ్మ జాతకమే మారిపోయింది. ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. మధ్యలో లవ్, డేటింగ్, రిలేషన్ షిప్ అంటూ కాస్త గ్యాప్ తీసుకున్నా రీ ఎంట్రీలో దుమ్ము దులుపుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్ లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

తాజాగా శ్రుతిహాసన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. శ్రుతిహాసన్ తాను చేయించుకున్న సర్జరీ గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు నాకు నా ముక్కు నచ్చేది కాదు. అందుకే సర్జరీ చేయించుకున్నా.. అలాగే ముఖం ఇంకా అందంగా కనిపించేందుకు ఫిల్లర్స్‌ కూడా చేయించుకున్నా.. దీంట్లో దాచిపెట్టడానికి ఏమీ లేదు.. చాలా ఇంటర్వ్యూల్లో నేను ఈ విషయం చెప్పా.. కొంతమంది మాత్రం దీని గురించి బయటకు చెప్పకుండా దాచుకుంటారు. నేను వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తా.. అలాగే నాలాగే దైర్యంగా బయటకు చెప్పే వారిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు.. భవిష్యత్తులో వయసు పైబడ్డాక ఫేస్‌ లిఫ్ట్‌ కూడా చేయించుకుంటానేమో చూడాలి. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నా శరీరం నా ఇష్టం. ఇతరులకు ఇబ్బంది లేనప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది” అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us