AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాడ్ లక్ సఖి..! 12 సినిమాలు చేస్తే.. ఒకేఒక్క హిట్..!! స్పెషల్ సాంగ్ చేసిన కలిసి రాని అదృష్టం..

సినీరంగంలో హీరోయిన్‏గా గుర్తింపు రావాలంటే అందం మాత్రమే కాదు.. కాసింత అదృష్టం కూడా ఉండాలి. కొందరి విషయంలో టాలెంట్ ఎంత ఉన్న లక్కు మాత్రం కలిసిరాలేదు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. కట్ చేస్తే.. అవకాశాలకు దూరంగానే ఉండిపోయింది.

బ్యాడ్ లక్ సఖి..! 12 సినిమాలు చేస్తే.. ఒకేఒక్క హిట్..!! స్పెషల్ సాంగ్ చేసిన కలిసి రాని అదృష్టం..
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 20, 2025 | 8:37 AM

Share

చాలా మంది ముద్దుగుమ్మలు తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు. దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు కొన్ని సినిమాలతోనే పరిమితం అవుతున్నారు. వరుసగా సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే గడిపేస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఈ చిన్నది చేసింది 12 సినిమాలు కానీ హిట్స్ మాత్రం ఒకటి రెండు మాత్రమే.. హిందీలోనూ ట్రై చేసింది కానీ .. అక్కడా లాభం లేకుండా పోయింది. దాంతో సోషల్ మీడియాలో అరాచకం చేస్తుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది.

అవకాశాలు లేక తన గ్లామర్ తో దర్శక నిర్మాతలను ఆకర్షిస్తున్న ఈ అమ్మడు ఎవరో కాదు.. తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. తన అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఆతర్వాత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. వరుసగా సినిమాలు చేసినప్పటికీ అంతగా హిట్స్ అందుకోలేదు. ఆమె ఎవరో కాదు బోల్డ్ బ్యూటీ సీరత్ కపూర్. శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి

ఆతర్వాత ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెప్పించింది. ఆతర్వాత తెలుగులో ఎక్కడా కనిపించలేదు ఈ చిన్నది. రన్ రాజా రన్ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసింది..కానీ.. ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది కానీ అంతగా గుర్తింపు రాలేదు. అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. 2015లో సందీప్ కిషన్ నటించిన టైగర్ చిత్రంలో నటించింది. ఇక ఆ తర్వాత కొలంబస్, రాజు గారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కాగా.. ఈ అమ్మడుకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ ఇండస్టీలో కొరియోగ్రాఫర్ గా చేసిన సీరత్ కపూర్.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె షేర్ చేసిన లేటేస్ట్ గ్లామర్ ఫోటోస్ వైరలవుతున్నాయి.ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వాషింగ్ మెషీన్‌లో కేవలం బట్టలే కాదు.. ఇవి కూడా ఉతకొచ్చు!
వాషింగ్ మెషీన్‌లో కేవలం బట్టలే కాదు.. ఇవి కూడా ఉతకొచ్చు!
రాజస్థాన్ రాయల్స్ హిస్టరీలో టాప్-3కి చేరిన యువ బ్యాటర్
రాజస్థాన్ రాయల్స్ హిస్టరీలో టాప్-3కి చేరిన యువ బ్యాటర్
బెంగాల్‌లో ఫుల్లీ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌..!
బెంగాల్‌లో ఫుల్లీ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌..!
మీ ఆస్తి విషయంలో పిల్లల మధ్య గొడవలు రాకూడదా? ఇది ఎందుకు ముఖ్యం?
మీ ఆస్తి విషయంలో పిల్లల మధ్య గొడవలు రాకూడదా? ఇది ఎందుకు ముఖ్యం?
IPL 2026 Playoffs Race: ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ 5 జట్లు అవుట్
IPL 2026 Playoffs Race: ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ 5 జట్లు అవుట్
ప్రపంచానికి చమురు సెగ.. తెలుగురాష్ట్రాల్లో పెట్రోల్‌ కష్టాలు తీరే
ప్రపంచానికి చమురు సెగ.. తెలుగురాష్ట్రాల్లో పెట్రోల్‌ కష్టాలు తీరే
పుదీనా Vs కొత్తిమీర: వేసవిలో కడుపు సమస్యలకు ఏది బెస్ట్..?
పుదీనా Vs కొత్తిమీర: వేసవిలో కడుపు సమస్యలకు ఏది బెస్ట్..?
వీరికి ఆదాయం, ఆరోగ్యం ఉన్నా ఊహించని సమస్యలు..
వీరికి ఆదాయం, ఆరోగ్యం ఉన్నా ఊహించని సమస్యలు..
పంజాబ్ ఫస్ట్, ఆర్సీబీ సెకండ్.. మరి ముంబై, చెన్నై పరిస్థితి ఏంటి?
పంజాబ్ ఫస్ట్, ఆర్సీబీ సెకండ్.. మరి ముంబై, చెన్నై పరిస్థితి ఏంటి?
ఎండ వల్ల ముఖం నల్లబడిందా?.. ఇంట్లోనే ఇలా క్షణాల్లో మెరిపించండి
ఎండ వల్ల ముఖం నల్లబడిందా?.. ఇంట్లోనే ఇలా క్షణాల్లో మెరిపించండి