AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Behara: ఒక్కటైన టాలీవుడ్ సింగర్స్.. పెళ్లి చేసుకున్న అనురాగ్ కులకర్ణి.. రమ్య బెహరా..

తెలుగు సింగర్స్ రమ్య బెహారా, అనురాగ్ కులకర్ణి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మ్యారేజ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది.

Ramya Behara: ఒక్కటైన టాలీవుడ్ సింగర్స్.. పెళ్లి చేసుకున్న అనురాగ్ కులకర్ణి.. రమ్య బెహరా..
Anurag Kulakarni, Ramya Beh
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2024 | 9:52 AM

Share

టాలీవుడ్ స్టార్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం హైదరాబాద్‏లో వీరిద్దరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది బంధవులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగినట్లు సమాచారం. అయితే వీరిద్దరిది ప్రేమ పెళ్లి అని తెలుస్తోంది. కొన్నాళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని.. కుటుంబసభ్యుల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి పీటలెక్కారని అంటున్నారు నెటిజన్స్. అయితే వీరిద్దరి వివాహనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే టాలీవుడ్ సింగర్స్ సైతం వీరిద్దరి వివాహం గురించి ఎలాంటి పోస్టులు చేయలేదు.

తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు అనురాగ్ కులకర్ణి. C/o కంచెరపాలెం సినిమాలోని ఆశపాశం సాంగ్ ద్వారా పాపులర్ అయ్యాడు అనురాగ్ కులకర్ణి. ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 లోని పిల్లా రా వంటి ఎన్నో పాటలను ఆలరించాడు. బుల్లితెరపై సూపర్ సింగర్ 8 సీజన్ విజేతగా నిలిచాడు అనురాగ్ కులకర్ణి. దీంతో నెమ్మదిగా సినీరంగంలో అవకాశాలు అందుకుంటూ ఇప్పుడు తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

రమ్య బెహారా విషయానికి వస్తే.. ఆమె సైతం సూపర్ సింగర్ 4లో పాల్గొంది. బాహుబలి, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, ఇస్మార్ట్ శంకర్, శతమానం భవతి వంటి చిత్రాల్లో అనేక పాటలు పాడింది రమ్య. ఆమె గాత్రానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు అనురాగ్, రమ్య పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇటీవలే వీరిద్దరు కలిసి హే రంగులే సాంగ్ ఆలపించారు. ఈ పాట యూట్యూబ్ మిలియన్ వ్యూస్ రాబట్టింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.