Yakkali Ravindra Babu: టాలీవుడ్‌లో మరో విషాదం.. అవార్డు విన్నింగ్ సినిమాల నిర్మాత కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. శనివారం (నవంబర్ 11)న చంద్ర మోహన్ మరణవార్తను మరవక ముందే ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు(55) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. యక్కలి రవీంద్ర బాబుకు భార్య రమా దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. శనివారం (నవంబర్ 11)న చంద్ర మోహన్ మరణవార్తను మరవక ముందే ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు(55) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. యక్కలి రవీంద్ర బాబుకు భార్య రమా దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవీంద్ర బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాంటూ ప్రార్థిస్తున్నారు. శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్‌పై తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో సుమారు 17 సినిమాలను నిర్మించారు రవీంద్ర బాబు. తెలుగులో సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలోనే ఆయన ఎక్కువగా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. విమర్శకుల ప్రశంసలతో పాటు పురస్కారాలు అందుకున్న ‘సొంత ఊరు’, ‘గంగ పుత్రులు’ వంటి సినిమాలు రవీంద్ర బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కినవే. అలాగే వసూళ్ల పరంగా సంచలనం సృష్టించిన ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘రొమాంటిక్ క్రిమినల్స్’ సినిమాలు కూడా రవీంద్ర బాబు నిర్మించినవే.
చార్టెర్డ్ ఇంజీనిర్ టు ప్రొడ్యూసర్..
అలాగే ‘గల్ఫ్’, ‘వలస’ వంటి సందేశాత్మక సినిమాలు, ‘వెల్ కమ్ టు తీహార్ కాలేజ్’ వంటి యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మూవీస్ రవీంద్ర బాబు రూపొందించినవే. నిర్మాతగానే కాకుండా సింగర్ గానూ ఆయన సత్తా చాటారు. రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన ‘మా నాన్న నక్సలైట్’, ‘హనీ ట్రాప్’, సంస్కార కాలనీ వంటి సినిమాల్లోని పాటలను రవీంద్రనే రచించడం విశేషం. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే. యక్కలి రవీంద్ర స్వస్థలంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో గల మార్కాపురం. పుట్టిన ఊరిలోనే పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత చార్టర్డ్ ఇంజనీర్ పని చేశారు. అయితే సినిమాలపై ఆసక్తిగా నిర్మాతగా పరిశ్రమలో అడుగు పెట్టారు. వైవిధ్యభరితమైన చిత్రాలను నిర్మించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఆదివారం (నవంబర్ 11) హైదరాబాద్‌లో రవీంద్రబాబు అంత్యక్రియలు జరుగుతాయని ఆయన సన్నిహితులు తెలిపారు.
చంద్ర మోహన్ మరణ వార్తను మరవక ముందే మరో విషాదం..
‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం.
నా తొలి చిత్రం ‘ప్రాణం… pic.twitter.com/vLMw4gTXOs
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








