Bandla Ganesh: “తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని విడదీస్తాడు”.. బండ్లన్న ట్వీట్ ఎవరిని ఉద్దేశించబ్బా..!!

రవితేజ నటించిన ఆంజనేయులు అనే సినిమాతో నిర్మాతగా మారారు బండ్ల గణేష్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తీన్ మార్, గబ్బర్ సింగ్ అనే సినిమాలు చేశారు. అలాగే ఎన్టీఆర్ తో బాద్షా, టెంపర్ సినిమాలు చేశారు.

Bandla Ganesh: తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని విడదీస్తాడు''.. బండ్లన్న ట్వీట్ ఎవరిని ఉద్దేశించబ్బా..!!
Bandla Ganesh
Follow us
Rajeev Rayala

|

Updated on: May 26, 2023 | 12:38 PM

టాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత నిర్మాతగా ఎదిగారు బండ్ల గణేష్. రవితేజ నటించిన ఆంజనేయులు అనే సినిమాతో నిర్మాతగా మారారు బండ్ల గణేష్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తీన్ మార్, గబ్బర్ సింగ్ అనే సినిమాలు చేశారు. అలాగే ఎన్టీఆర్ తో బాద్షా, టెంపర్ సినిమాలు చేశారు. అలాగే అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే, నీజతగా నేనుండాలి అనే సినిమాలు చేశారు. చాలా  కాలం తర్వాత బండ్ల గణేష్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో చిన్న పాత్రలో నటించారు. ప్రస్తుతం బండ్ల గణేష్ సినిమాలు తగ్గించారు. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన పవన్ అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటారు బండ్ల

ఇదిలా ఉంటే ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ తాజాగా చేసిన ట్వీట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. గురూజీ అంటూ చేస్తోన్న ట్వీట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు బండ్ల రిప్లే ఇచ్చారు. గురూజీ కి కథ చెపితే స్క్రీన్ ప్లే రాసి దానికి తగట్టు మళ్ళీ కథను మార్చి అనుకున్న కథను shed పంపిస్తాడు అని టాక్ ఉంది. అని ట్వీట్ చేశాడు.

దానికి బండ్ల గణేష్ రిప్లే ఇస్తూ.. అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ. అంటూ రాసుకొచ్చారు. అయితే బండ్ల గణేష్ గురూజీ అని ఎవరిని సంబోధిస్తూ ఈ ట్వీట్స్ చేశారు.? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.