AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ ‘డార్లింగ్’ మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా.?

Tollywood News: సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో కోసం రాసుకున్న కథ మరొక స్టార్ హీరో దగ్గరకు వెళ్లడం సర్వసాధారణం. ఆ కథ ఫ్లాప్ అయితే పెద్దగా పనుండదు. కానీ బాక్సాఫీస్ దగ్గర హిట్ కొడితే మాత్రం మంచి సినిమాను మిస్ చేసుకున్నామేనని అనుకుంటున్నారు హీరోలు.

Prabhas: ప్రభాస్ 'డార్లింగ్' మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా.?
Prabhas
Ravi Kiran
|

Updated on: May 26, 2023 | 1:00 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథ మరొక హీరో దగ్గరకు వెళ్లడం సర్వసాధారణం. ఆ కథ ఫ్లాప్ అయితే పెద్దగా పనుండదు. కానీ బాక్సాఫీస్ దగ్గర హిట్ కొడితే మాత్రం మంచి సినిమాను మిస్ చేసుకున్నామేనని అనుకుంటున్నారు స్టార్ హీరోలు. అలా టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో తన దగ్గరకు వచ్చిన బ్లాక్‌బస్టర్ కథను వదులుకున్నాడు.. కట్ చేస్తే.. ఆ కథలో సూపర్ హిట్ కొట్టాడు మరో హీరో. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరనుకుంటున్నారా..? అల్లు అర్జున్, ప్రభాస్.

డైరెక్టర్ కరుణాకరన్, హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘డార్లింగ్’ చిత్రం అందరికీ గుర్తుండిపోతుంది. ఆ సమయంలో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు.. ప్రభాస్ కెరీర్‌ను సైతం మలుపు తిప్పింది. అద్భుతమైన లవ్‌స్టోరీగా తెరకెక్కిన ‘డార్లింగ్’ చిత్రం కథను మొదటిగా అల్లు అర్జున్‌కు వినిపించారట డైరెక్టర్ కరుణాకరన్. అయితే ఆయన వేరే ప్రాజెక్ట్స్ లైనప్‌లో ఉండటం.. అలాగే ఇందులో మాస్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండటంతో బన్నీ దీన్ని రిజెక్ట్ చేశారట. ఇక ఈ స్టోరీనే ప్రభాస్ విని.. ఓకే చేశాడు. అంతే! ఆ తర్వాత ఔట్‌పుట్ మీకు తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రభాస్‌ను ఫ్యాన్స్ అందరికీ ‘డార్లింగ్’లా మరింత చేరువ చేసింది. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే.

Follow Us
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్