Tollywood: టాలీవుడ్‌లోకి మరో యూట్యూబర్.! హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న హర్ష సాయి.? నిర్మాత ఎవరంటే..

Ravi Kiran

Ravi Kiran |

Updated on: May 26, 2023 | 12:30 PM

Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయి.. సోషల్ మీడియాలో ఈ పేరుకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. యూట్యూబ్ ద్వారా తాను సంపాదించిన డబ్బుతో పేదలకు సాయం చేస్తూ.. ఇలా నెట్టింట సంచలనంగా మారాడు ఈ వ్యక్తి. అటు సమాజసేవా కార్యక్రమాలతో..

Tollywood: టాలీవుడ్‌లోకి మరో యూట్యూబర్.! హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న హర్ష సాయి.? నిర్మాత ఎవరంటే..
Harsha Sai

Follow us on

యూట్యూబర్ హర్ష సాయి.. సోషల్ మీడియాలో ఈ పేరుకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. యూట్యూబ్ ద్వారా తాను సంపాదించిన డబ్బుతో పేదలకు సాయం చేస్తూ.. ఇలా నెట్టింట సంచలనంగా మారాడు ఈ వ్యక్తి. అటు సమాజసేవా కార్యక్రమాలతో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను పెంచుకున్నాడు. యూట్యూబ్‌లో 8.64 మిలియన్లు, ఇన్‌స్టాలో 4 మిలియన్లు, ఫేస్‌బుక్‌తో ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లలో కలిపి ఏకంగా 10 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ హర్ష సాయి సొంతం. ఇదిలా ఉంటే.. అటు రాజకీయాల్లోకి లేదంటే ఇటు సినిమాల్లోకి హర్ష సాయి వస్తాడంటూ గతకొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి హర్ష సాయి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని ఓ వార్త మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తోంది.

బిగ్ బాస్ ఫేం మిత్రా శర్మ ఈ సినిమాను నిర్మించనున్నాడని తెలుస్తోంది. దీనిలో హీరోగా మాత్రమే కాదు.. దర్శకుడిగా కూడా హర్ష సాయి వ్యవహరించబోతున్నట్లు టాక్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉండొచ్చునని తెలుస్తోంది. తన సేవాగుణంతో ఎంతోమంది కుటుంబాల్లో వెలుగులు నింపిన హర్ష సాయి.. సినిమాల్లో కూడా రాణించాలని కోరుకుందాం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu