అనగనగా ఒక రాజు రిలీజ్ డేట్ వచ్చేసింది .. సంక్రాంతికి నవ్వులు పూయిస్తానంటున్న నవీన్ పోలిశెట్టి..
డైరెక్టర్ అనుదీప్ కెవి తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో నవీన్ పొలిశెట్టి. అప్పటివరకు కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రలలో కనిపించిన నవీన్.. ఈ సినిమాతో హీరోగా మారాడు. కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో తనదైన నటనతో కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు.

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రమాదానికి గురయ్యాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు నవీన్ పోలిశెట్టి. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు. ఆతర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో నవీన్ పోలిశెట్టి పేరు మారుమ్రోగింది. అలాగే స్టార్ హీరోయిన్ అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా చేశాడు.ఈ సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నా ఇంతవరకు నవీన్ న్యూ మూవీ పై అప్డేట్ లేదు. దాంతో రకరకాల రూమర్స్ వచ్చాయి.
ఆ మధ్య అనగనగా ఒక రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. గతంలో ఓ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ప్రీ వెడ్డింగ్ వీడియో అంటూ విడుదల చేసిన ఈ వీడియో నిడివి కేవలం మూడు నిమిషాల 2 సెకన్లు మాత్రమే ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమా అసలు వస్తుందా రాదా అనే డౌట్ మొదలైంది .
అయితే ఇదే టైం లో సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నవీన్ లుంగీ – బనియన్ ధరించి.. నోట్లో వేప పుల్లతో బైక్‌పై వస్తున్న ఓ పోస్టర్ తో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. కాగా ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా కూడా రానుంది. ఈ సినిమాకు పోటీగా ఇప్పుడు నవీన్ పోలిశెట్టి సినిమా రానుంది. చూడాలి మరి నవీన్ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




