AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగచైతన్య మామూలోడు కాదుగా..! మొదటి ముద్దు ఆమెకే.. అది నా జీవితమంతా గుర్తుంచుకుంటా..!

అక్కినేని అందగాడు నాగ చైతన్య రీసెంట్ గా తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా యదార్ధ ఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగ చైతన్య మత్యకారుడిగా నటించి ఆకట్టుకున్నాడు. చైతూకు జోడీగా సాయి పల్లవి నటించి మెప్పించింది.

నాగచైతన్య మామూలోడు కాదుగా..! మొదటి ముద్దు ఆమెకే.. అది నా జీవితమంతా గుర్తుంచుకుంటా..!
Naga Chaitanya
Rajeev Rayala
|

Updated on: May 26, 2025 | 11:59 AM

Share

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు చైతూ. రీసెంట్ గా తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మత్యకారుడిగా కనిపించాడు నాగ చైతన్య. తండేల్ రాజుగా అద్భుతంగా నటించి మెప్పించాడు నాగ చైతన్య. ఇక ఈ అక్కినేని అందగాడి పర్సనల్ లైఫ్ గురించి అందరికి తెలిసిందే. నాగ చైతన్య మొదట స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆతర్వాత ఈ ఇద్దరూ ఊహించని విధంగా విడిపోయారు. సోషల్ మీడియా వేదికగా సమంత నాగ చైతన్య విడిపోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఆతర్వాత చాలా కాలం ఇద్దరూ తమ సినిమాలతో బిజీ అయ్యేరు.

ఇది కూడా చదవండి : సినిమా అట్టర్ ఫ్లాప్ అని నిర్మాత బోరున ఏడ్చేశాడు.. కట్ చేస్తా 400రోజులు ఆడి.. ఇండస్ట్రీని షేక్ చేసింది

అయితే నాగ చైతన్య సామ్ తో విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు. ఈ ఇద్దరూ తమ రిలేషన్ ను చాలా రోజులు సీక్రెట్ గా ఉంచారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ప్రస్తుతం శోభిత, చైతూ తమ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా నాగ చైతన్య తన తొలి ముద్దు ఎవరికీ ఇచ్చాడో తెలిపాడు. శోభితతో పెళ్లి తర్వాత నాగ చైతన్య రానా నిర్వహించిన ఓ టాక్ షోలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 17 ఏళ్ల క్రితం తల్లిపాత్ర చేసింది.. ఇప్పుడు అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది..

ఆ సమయంలో ఆయన తన తొలి ముద్దు అనుభవం గురించి వెల్లడించారు. మొదటి ముద్దు ఎప్పుడు.? ఎవరికి పెట్టావో గుర్తుందా..? అని రానా అడిగిన ప్రశ్నకు నాగ చైతన్య ఆసక్తికర సమాధానం చెప్పారు. తొమ్మిదో తరగతిలోనే ఓ అమ్మాయికి మొదటి ముద్ద ఇచ్చిన విషయాన్ని నాగ చైతన్య తెలిపారు. ఆ ముద్దు నా జీవితమంతా పని చేసింది అని చైతు అన్నారు. అలాగే ఓ అభిమాని తన దగ్గరకు వచ్చి సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పడం కూడా నాకు మర్చిపోలేని జ్ఞాపకమని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : అది దా సర్‌ప్రైజ్‌..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!