AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది ఏడుపుగొట్టు సినిమా కాదు.. కానీ కన్నీళ్లు వస్తాయి.. అడవి శేష్ కామెంట్స్

అడవి శేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అలాగే కర్మ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో కామియో చేశాడు. ఇక ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గూఢచారి, హిట్ 2, ఎవరు, మేజర్, సినిమాలతో హిట్స్ అందుకున్నాడు శేష్. ఇక ఇప్పుడు గూఢచారి 2, డెకాయిట్ సినిమాల్లో నటిస్తున్నాడు.

అది ఏడుపుగొట్టు సినిమా కాదు.. కానీ కన్నీళ్లు వస్తాయి.. అడవి శేష్ కామెంట్స్
Adivi Sesh
Rajeev Rayala
|

Updated on: May 24, 2025 | 8:29 AM

Share

చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి. బడా హీరోల సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవుతూ ప్రపంచం మొత్తం మన సినిమాల వైపు చూసేలా చేస్తున్నాయి. అలాగే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలై కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. ఆచితూచి సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. తాజాగా అడవి శేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ సినిమా గురించి అడవి శేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

రీసెంట్ గా అక్కినేని హీరో సుమంత్ నటించిన అనగనగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కాజల్‌ చౌదరి హీరోయిన్‌గా నటించింది. మాస్టర్‌ విహర్ష్‌, అవసరాల శ్రీనివాస్‌, అను హాసన్‌, రాకేశ్‌ రాచకొండ, బీవీఎస్‌ రవి, కౌముది నేమాని  ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హీరో అడవి శేష్ గెస్ట్‌గా హాజరయ్యారు. ” నా ఫస్ట్ సినిమా ఈవెంట్‌కి సుమంత్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఇప్పుడు ఆయన సినిమా ఫంక్షన్‌కు నేను వచ్చాను..అనగనగా అనే సినిమా ఏడుపుగొట్టు సినిమా కాదు ఈ సినిమా ఒక లైఫ్ అని అన్నారు అడవిశేష్. ఈ సినిమా ప్రతిఒక్కరికి కనెక్ట్ అవుతుంది..కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి అని శేష్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్