AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: వెళ్లి నాన్న కాళ్ళు పట్టుకోవాలనుంది.. కానీ.. మంచు మనోజ్ ఎమోషల్ కామెంట్స్

మంచు మనోజ్ నటిస్తున్న భైరవం సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భైరవం సినిమాలో మనోజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు మనోజ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనోజ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Manchu Manoj: వెళ్లి నాన్న కాళ్ళు పట్టుకోవాలనుంది.. కానీ.. మంచు మనోజ్ ఎమోషల్ కామెంట్స్
Manchu Manoj
Rajeev Rayala
|

Updated on: May 24, 2025 | 7:47 AM

Share

మంచు మనోజ్ కు మంచు విష్ణుకు మధ్య జరుగుతున్న వివాదాల గురించి తెలిసిందే.. మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబుతో జరుగుతున్న కుటుంబ వివాదాల నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంతో మాట్లాడారు. మనోజ్ మాట్లాడుతూ.. “వెళ్లి నాన్న కాళ్ళు పట్టుకోవాలని, నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఇప్పటికీ ఉంది. కానీ, చేయని తప్పుని అంగీకరిస్తే..? నా పిల్లలకు నేనేం నేర్పిస్తా. మా నాన్న నేర్పించిన నీతి ఇది. అందుకే నేను ముందుకెళ్లలేకపోతున్నా. మేమంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నా. సమస్యలు సృష్టించిన వారు తమ తప్పుని తెలుసుకుంటారనే నమ్మకం ఉంది.” అని అన్నారు మనోజ్.

మనోజ్ చేసిన ఈ కామెంట్స్మం తన తండ్రి పట్ల గౌరవం, ప్రేమను కలిగి ఉన్నప్పటికీ, కుటుంబంలో జరుగుతున్న విభేదాల కారణంగా ఆయన మనసు ఎంతబాధపడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ వివాదాలు ఆస్తి తగాదాలు కాదని, ఆత్మగౌరవం, నీతి సంబంధిత విషయాలపై తన పోరాటం అని మనోజ్ గతంలోనూ స్పష్టం చేశారు. ఆయన తన తండ్రి నేర్పిన నీతి విలువలను పాటిస్తూ, చేయని తప్పు విషయంలో క్షమాపణ చెప్పలేనని, అలా చేస్తే తన పిల్లలకు తప్పుడు సందేశం వెళ్తుందని మనోజ్ అన్నారు.

అలాగే మనోజ్ తన కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలని, అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మనోజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆయన నటించిన భైరవం సినిమా విడుదల కానుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ కలిసి నటిస్తున్నారు. మే 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాతో మంచి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని అయన అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..