AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా అట్టర్ ఫ్లాప్ అని నిర్మాత బోరున ఏడ్చేశాడు.. కట్ చేస్తా 400రోజులు ఆడి.. ఇండస్ట్రీని షేక్ చేసింది

ఇండస్ట్రీలో ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం.. కొన్నిసార్లు హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు అనుకోకుండా ఫ్లాప్ అవుతాయి.. ఫ్లాప్ అవుతాయి అనుకున్న సినిమాలు ఊహించని విధంగా భారీ హిట్స్ అవుతాయి.

సినిమా అట్టర్ ఫ్లాప్ అని నిర్మాత బోరున ఏడ్చేశాడు.. కట్ చేస్తా 400రోజులు ఆడి.. ఇండస్ట్రీని షేక్ చేసింది
Movie New
Rajeev Rayala
|

Updated on: May 24, 2025 | 11:48 AM

Share

వారాంతం వచ్చిందంటే చాలు థియేటర్స్ కొత్త సినిమాలతో కళకళలాడుతున్నాయి. వారం వారం కొత్త సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు ఆ సినిమాను ఎవ్వరూ ఆపలేరు. కథలో బలం ఉంటే చిన్న సినిమా అయినా సరే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ఇందుకు ఉదాహరణగా చాలా సినిమాలు ఉన్నాయి. ఇక నిర్మాతలు కూడా సినిమా బడ్జెట్ విషయాల్లో వెనకాడటం లేదు.. ఎంత బడ్జెట్ పెట్టి సినిమాలు చేయడానికైనా సరే రెడీ అంటున్నారు. అయితే కొన్ని సినిమాలు ఊహించినట్టే భారీ విజయాన్ని అందుకొని నిర్మాతకు లాభాలు తెచ్చిపడుతుంటాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొత్త నష్టాన్ని తెచ్చిపెడతుంటాయి. అయితే ఓ నిర్మాత తన సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది .

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే.. ఊహించని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఓ సినిమా విషయంలోనూ అదే జరిగింది. సినిమా ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుందని నిర్మాత బోరున ఏడ్చాడు.. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సంచలన విజయం సాధించింది. ఇండస్ట్రీని షేక్ చేసింది. ఏకంగా 400 రోజులు థియేటర్స్ లో ఆడి నయా రికార్డ్ చేసింది. ఆ సినిమా ఎదో కాదు బాలీవుడ్ లో తెరకెక్కిన “దో రాస్తే”. ఇది రాజ్ ఖోస్లా దర్శకత్వంలో రాజేష్ ఖన్నా, ముంతాజ్, బల్రాజ్ సాహ్నీ, ప్రేమ్ చోప్రా వంటి నటులతో రూపొందింది. ఈ చిత్రం కుటుంబ విలువలు, ప్రేమ, బాధ్యతలు, త్యాగం వంటి ఇతివృత్తాల చుట్టూ తిరుగుతుంది.

అయితే ఈ సినిమా విడుదల సమయంలో బాంబేలోని రాయల్ ఒపేరా హౌస్‌లో దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దాంతో ఈ సినిమా పోతుందని నిర్మాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదే సమయంలో రాజేష్ ఖన్నా నటించిన ఆరాధన సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్ మేనేజర్ దేశాయ్ ‘దో రాస్తే’ ఫ్లాప్ అవుతుందని మహేష్ భట్, వామన్ భోంస్లేలతో చెప్పాడు. దాంతో నిర్మాతల్లో ఒక్కరైనా మహేష్ భట్ సినిమా పోతుందని కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఎందుకంటే ఆ సినిమా కథతో మహేష్ భట్ ఎంతో కనెక్ట్ అయ్యాడట.. అప్పుడు మహేష్ భట్ వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే దాంతో అతను ఎమోషనల్ అయ్యి బోరున ఏడ్చాడట. కట్ చేస్తే ‘దో రాస్తే’ రాయల్ ఒపెరా హౌస్‌లో 50 వారాలకు పైగా ఆడింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ