AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో స్టార్ హీరో.. వందలకోట్లకు అధిపతి.. కానీ ఇలా బిచ్చగాడిలా రోడ్ల పై తిరుగుతూ కనిపించాడు..

స్టార్ హీరోల రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కాస్ట్లీ కార్లు , పెద్ద పెద్ద ఇళ్లు , ఖరీదైన బట్టలు వేసుకుంటారు. ఒకొక్క సినిమా కోసం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే ఓ స్టార్ హీరో హీరో ఆ లైఫ్ ను వదిలేసి ఇలా బిచ్చగాడిలా మారాడు. ఇంతకూ పై ఫొటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.?

ఇండస్ట్రీలో స్టార్ హీరో.. వందలకోట్లకు అధిపతి.. కానీ ఇలా బిచ్చగాడిలా రోడ్ల పై తిరుగుతూ కనిపించాడు..
Hero
Rajeev Rayala
|

Updated on: May 26, 2025 | 9:30 AM

Share

అప్పట్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు రాజులు, మహారాజులు వ్యాపారులుగా, సామాన్యులుగా వేషాలు వేసుకుని సొంత రాజ్యంలో వీధుల్లో తిరిగేవారు. ఇప్పుడు అదంతా కుదరదు కానీ కొందరు నటీనటులు, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు అప్పుడప్పుడూ గెటప్స్ మార్చుకుని జనాల మధ్య తిరుగుతున్నారు. సినిమా వాళ్ళు గెటప్స్ మార్చుకొని  థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడటం అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఇలా గెటప్స్ మార్చుకోవడం వల్ల  ప్రజలను దగ్గరగా చూడటం. వారితో మాట్లాడే అవకాశం సెలబ్రెటీలకు లభిస్తుంది. మొన్నామధ్య ఒక సూపర్ స్టార్ ముంబై వీధుల్లో రాతి యుగపు వ్యక్తిగా వేషంధరించి తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇప్పుడు మరోసారి అదే వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే అతనెవరో గుర్తుపట్టారా.? తెలిస్తే ఫ్యూజులెగిరిపోతాయి. అతను ఓ స్టార్ హీరో.. వందల కోట్లకు అధిపతి..

ఇది కూడా చదవండి : అది దా సర్‌ప్రైజ్‌..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

రాతి యుగానికి చెందిన మనిషిలా పొడవాటి గడ్డం, పొడవాటి జుట్టుతో ఒక వ్యక్తి తన శరీరానికి జంతువుల చర్మాన్ని చుట్టి, కాళ్ళకు బూట్లు ధరించి ముంబైలోని రద్దీ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. బిచ్చగాడిలా హ్యాండ్‌కార్ట్‌ను లాగుతూ.. రోడ్‌సైడ్ షాపులకు వెళ్లి ఆహారం అడిగాడు. ఆ వ్యక్తి అవతారం చూసిన కొందరు పారిపోయారు.బిచ్చగాడిలా మారి జనాల్లో తిరిగిన ఆయన భారతదేశంలోని సూపర్ స్టార్స్ లో ఒకరు

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 17 ఏళ్ల క్రితం తల్లిపాత్ర చేసింది.. ఇప్పుడు అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది..

అయన ఎవరో కాదు ఇండియన్ సినిమా స్టార్ యాక్టర్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్. అమీర్  బిచ్చగాడు వేషం వేసుకుని ముంబై వీధుల్లో తిరిగాడు. తొలుత ఈ వీడియో వైరల్‌గా మారడంతో ముంబై వీధుల్లో ఎవరో విచిత్రమైన వ్యక్తి సంచరిస్తున్నాడని భావించారు. అయితే అమీర్ ఖాన్ మేకప్ వేసుకుంటున్న వీడియో, చిత్రాలు బయటకు వచ్చిన తర్వాతే ముంబై వీధుల్లో అలా తిరిగే అమీర్ ఖాన్ అని తెలిసింది. అయితే అమీర్ ఖాన్ ఇలాంటి వింత వేషధారణలో ముంబై వీధుల్లో ఎందుకు తిరుగుతున్నాడో ఎవరికీ తెలియదు. అది సినిమా కోసమని కొందరు అంటున్నారు. మరికొందరు అది ఏదో ప్రకటన కోసం కావచ్చునని కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనువు అమీర్ ఖాన్ మారువేషాలు వేసుకుని నగరాల వీధుల్లో తిరిగాడు. గతంలో మారువేషంలో సౌరవ్ గంగూలీ ఇంటికి అమీర్ ఖాన్ వెళ్లాడు.

ఇది కూడా చదవండి : సినిమా అట్టర్ ఫ్లాప్ అని నిర్మాత బోరున ఏడ్చేశాడు.. కట్ చేస్తా 400రోజులు ఆడి.. ఇండస్ట్రీని షేక్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.