Tollywood Drug Case: మరోసారి తెరపైకి టాలీవుడ్ డ్రగ్ కేసు.. తీరు మార్చుకోని నవదీప్.. నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధం

కస్టడీలోకి తీసుకున్న వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు మరికొంత మందిని అరెస్టు చేశారు. ఇంకొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో రామచంద్ర అనే సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రామ చంద్ ను విచారించిన పోలీసులు అతని నుండి మరికొన్ని పేర్లు రాబట్టారు. వీరిలో హీరో నవదీప్ పేరును రామచంద్ చెప్పినట్టు హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.

Tollywood Drug Case: మరోసారి తెరపైకి టాలీవుడ్ డ్రగ్ కేసు.. తీరు మార్చుకోని నవదీప్.. నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధం
Navdeep Pallapolu
Follow us
Vijay Saatha

| Edited By: Surya Kala

Updated on: Sep 15, 2023 | 11:07 AM

టాలీవుడ్ డ్రగ్స్ కేస్ మరోసారి తెరమీదకి వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో పలువురు పేర్లు వినిపించాయి. వారిని దర్యాప్తు సంస్థలు పిలిచి విచారణ కూడా చేశాయి. తాజాగా ఆ లిస్టులో ఉన్న నవదీప్ పేరు మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఇటీవల మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ పై హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు రైడ్ చేసిన విషయం తెలిసిందే. సినిమా ఫైనాన్షియర్ వెంకట్ తో పాటు పలువురిని ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలోకి తీసుకున్న వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు మరికొంత మందిని అరెస్టు చేశారు. ఇంకొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో రామచంద్ర అనే సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రామ చంద్ ను విచారించిన పోలీసులు అతని నుండి మరికొన్ని పేర్లు రాబట్టారు. వీరిలో హీరో నవదీప్ పేరును రామచంద్ చెప్పినట్టు హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.

నవదీప్ తో కలిసి తాను డ్రగ్స్ పార్టీని నిర్వహించడంతోపాటు తాము డ్రగ్స్ ని స్వీకరించామని రామ్ చందర్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో నవదీప్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. నవదీప్ కొసం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. తాను గండిపేట్ లో ఉన్నానని పోలీసులకి నవదీప్ బదులిచ్చాడు. ప్రస్తుతం నవదీప్ ఇంకా పరారీలో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. నవదీప్ తో పాటు మరో ఎనిమిది మంది డ్రగ్ కన్జ్యూమర్లు పరారీలో ఉన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. వీరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు తెలిపారు.

డ్రగ్స్ కేసులో పదేపదే నవదీప్ పేరు వినిపిస్తూనే ఉంది.. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ హీరో నవదీప్ దర్యాప్తు సంస్థల ముందు విచారణకు హాజరయ్యాడు. హైదరాబాదులో ఓ ప్రముఖ పబ్ ను నిర్వహిస్తున్నాడు.. అయితే గురువారం పోలీసులు నవదీప్ పరారీలో ఉన్నట్టు ప్రెస్ మీట్ లో చెప్పారు. తాను ఎక్కడికి పారిపోలేదని హైదరాబాదులోనే ఉన్నానని టీవీ9 సంప్రదించగా నవదీప్ బదులిచ్చాడు. అయితే హీరో నవదీప్ కు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..