Krishna Mukunda Murari Episode September 15th, 2023: ప్రేమ కోసం చేసే పోరాటంలో జీవితాన్ని కోల్పోతున్నావు ముకుంద అంటూ అలేఖ్య హితవు..

ప్రేమలో ఓడిపోవడం విడిపోవడం కామన్ థింగ్.. కానీ భార్యాభర్తలు విడిపోవడం అనేది అంత ఈజీ కాదు.. పైగా కుటుంబం పరువు కోసం భవానీ అత్తయ్య ఎలా ఉంటారో.. నందిని విషయం లో మనం చూశామని ముకుందతో చెబుతుంది. అసహనంతో ముకుంద .. అలేఖ్య మీద అరుస్తుంది.  ఎప్పుడో గతంలో జరిగిపోయిన ప్రేమ కోసం నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది అని ముకుందకు అలేఖ్య హితవు చెబుతుంది. అంతేకాదు ఆదర్శ్ ను నువ్వు భర్తగా ఎలా యాక్సెప్ట్ చేయడంలేదో.. మురారీ కూడా నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు నువ్వు ఏమి చేస్తావు అని ముకుందను హెచ్చరిస్తుంది.

Krishna Mukunda Murari Episode September 15th, 2023: ప్రేమ కోసం చేసే పోరాటంలో జీవితాన్ని కోల్పోతున్నావు ముకుంద అంటూ అలేఖ్య హితవు..
Krishna Mukunda MurariImage Credit source: Hotstar
Follow us
Surya Kala

|

Updated on: Sep 18, 2023 | 7:49 AM

ముకుంద తనకు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటాడు మురారీ.. తనప్రేమని రిజెక్ట్ చేయకు అంటూ చెప్పిన విషయాలను.. అత్తయ్యకు నిజం చెప్పేసి మనం పెళ్లి చేసుకుందాం అని అన్నవిషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రేవతి మురారీ దగ్గరకు వస్తుంది. వర్షంలో ఎందుకు తడిచావు అని అంటే.. వదిలెయ్యమని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. రేవతి ఏమై ఉంటుంది.. కృష్ణతో గొడవ జరిగి ఉంటుందా.. లేదా ముకుంద బెదిరించి ఉంటుందా అని రేవతి ఆలోచిస్తూ కృష్ణ దగ్గరకు వెళ్తుంది.

 ప్రేమలో ప్రేమ మాత్రమే ఉంటుంది..

ముకుంద తన గదిలో మురారీ నిన్ను బ్లాక్ మెయిల్ చేశానని అనుకోకు.. నాకు నిన్ను దక్కించుకోవడానికి ఇది తప్పవేరే దారిలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఎప్పుడో ఒకసారి మనం తప్పకుండా కలుస్తామనే ఆశ నాలో చావలేదు. ప్రతి రోజూ నీ కోసం ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. నీ ఆశలో నీ ధ్యాసలో నాకు ఈ ప్రపంచమే గుర్తుండేది కాదు.. నాకు నువ్వు ఎక్కడ దూరం అవుతావేమో అన్న ఆలోచన నాకు ఎంతో బాధకలిగిస్తుంది. నువ్వు అంటే నాకు ప్రాణం మురారీ.. నువ్వు లేకుండా జీవితం చస్తూ బతికే కంటే.. ఈ ఒక్కసారి హర్ట్ అయినా నా ప్రేమని నువ్వు అర్ధం చేసుకుంటావు అనిపించింది. నా ప్రేమని అపార్ధం చేసుకుని దూరం చేసుకోకు ని ముకుంద తాను మురారీ ఉన్న ఫోటోని చూస్తూ మాట్లాడుకుంటుంది.

ఆదర్శ్ నా జీవితంలోకి రాడు.. కృష్ణ ఉండదు..

అలేఖ్య వచ్చి మురారీతో మాట్లాడవా నీ ప్రేమ గురించి ఏమన్నాడు అంటే.. తనకి నో చెప్పే ఆప్షన్ ఇవ్వలేదు. ప్రేమలో ప్రేమ మాత్రమే ఉండాలి. ఆప్షన్ ఉండకూడదు అని అంటుంది. అంటే ఆదర్శ్ ఇంక తిరిగిరాడా అంటే.. ఈ ఇంటికి వస్తాడేమో నా జీవితంలోకి రాడు.. అని అంటే మరి కృష్ణ అని అంటే.. మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది.

ఇవి కూడా చదవండి

ప్రేమని పొందాలనే పోరాటంలో జీవితాన్ని కోల్పోతున్నావు

అలేఖ్య .. ముకుంద ఎందుకో ఇదంతా వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది. అని అంటే ముకుంద కోప్పడకు ముకుంద నేను చెప్పేది ఆలోచింది. ప్రేమలో ఓడిపోవడం విడిపోవడం కామన్ థింగ్.. కానీ భార్యాభర్తలు విడిపోవడం అనేది అంత ఈజీ కాదు.. పైగా కుటుంబం పరువు కోసం భవానీ అత్తయ్య ఎలా ఉంటారో.. నందిని విషయం లో మనం చూశామని ముకుందతో చెబుతుంది. అసహనంతో ముకుంద .. అలేఖ్య మీద అరుస్తుంది.  ఎప్పుడో గతంలో జరిగిపోయిన ప్రేమ కోసం నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది అని ముకుందకు అలేఖ్య హితవు చెబుతుంది. అంతేకాదు ఆదర్శ్ ను నువ్వు భర్తగా ఎలా యాక్సెప్ట్ చేయడంలేదో.. మురారీ కూడా నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు నువ్వు ఏమి చేస్తావు అని ముకుందను హెచ్చరిస్తుంది. ప్రేమని పొందాలనే పోరాటంలో జీవితాన్ని కోల్పోతున్నావని అలేఖ్య ముకుందకు మంచి చెడుల గురించి వివరిస్తుంది. పిచ్చి అలేఖ్య నువ్వు నాణెకి ఒకవైపు మాత్రమే చూశావు. ప్రేమ కోసం జీవితాన్ని త్యాగం చేసే నాకు ఏమి ఆశ ఉంటుంది. నా ఆశ శ్వాస అన్నీ నా ప్రేమే.. మురారీనే అనుకుంటుంది మురారీ..

ఎవరునెవరు మోసం చేస్తున్నారు

కృష్ణ ..మురారీని హత్తుకుని ముకుంద చెప్పిన విషయాలను గుర్తు చేసుకుని కన్నీరు పెడుతుంది. అత్తయ్య నాకు ఏమి చెప్పింది. ఇక్కడ ఏమి జరుగుతుంది. ఒట్టేసి మరీ చెప్పింది నువ్వంటే తనకు ప్రాణమని.. ఇక్కడేమో ఒకరినొకరు హగ్ చేసుకుని మరీ ఉన్నారు. ఈ ఇంట్లో ఏసీపీ సార్ మనసులో నా స్థానం ఏమిటి అని కృష్ణ మదనపడుతుంది. ఇన్నాళ్లు నేను వెదుకుతున్న ఆ డైరీ అమ్మాయి ముకుంద రూపంలో ఎదురైంది కనుక మౌనంగా వెళ్లిపోవాలా ఇప్పుడు నా పరిష్టితి ఏమిటి అనుకుంటూ ఏడుస్తుంటే రేవతి వస్తుంది అక్కడికి. కృష్ణ ఏమిటి అలా ఉన్నావు. అంటే ఏమీ లేదు అత్తయ్య. వాడేమో దిగులుగా అలా వెళ్ళిపోయాడు.. ఇదేమో ఇలా ఉంది. చివరకు నన్ను నువ్వు కూడా మోసం చేశావు అత్తయ్య అని అనుకుంటుంది కృష్ణ. నా ఇష్టాయిష్టాలతో పనిలేదా అని అనుకుంటుంది. కృష్ణను వంట చేద్దామని రేవతి కిందకు తీసుకుని వెళ్తుంది.

గతం ఎంత బాగున్నా బతకాల్సింది ప్రస్తుతంలోనే..

ముకుంద గురించి ఆలోచిస్తూ గతం ఎంత బాగున్నా మనం బతకాల్సింది ప్రస్తుతంలోనే ఇది నువ్వు అర్ధం చేసుకోకపోతే అది నా తప్పుకాదు ముకుంద నన్ను క్షమించి అని మురారీ ఆలోచిస్తుంటే.. కృష్ణ తప్పులు అందరూ చేస్తారు.. అది సరిదిద్దుకునేవాళ్ళే ఉత్తములు మీ తప్పు ఒప్పుకుని అది సరిదిద్దుకోండి అప్పటి వరకూ నేను మిమ్మల్ని క్షమించను అని అనుకుంటుంటే.. మురారీ ఎక్కడికి వెళ్ళావు కృష్ణ అని అడుగుతాడు. గదిలో క్రింద నిద్రపోతున్న కృష్ణతో బెడ్ మీద నిద్రపోవచ్చు కదా ఎందుకు కింద నిద్రపోతావంటున్న మురారీని కృష్ణ చాలా కోపంగా చూస్తుంది. నాకు నిద్ర వస్తుంది పడుకోవాలి నేను ఏమీ కానా కృష్ణ అంత పెద్ద తప్పేమి చేశాను అని అంటే.. నేను మీ రూమ్ లో పడుకోవడం ఇష్టం లేదా చెప్పండి.. బయటకు వెళ్లి పడుకుంటా అని కృష్ణ చెబుతుంది.

మురారీ నిద్రపోతున్న రూమ్ లో కి ముకుంద్ టీ తీసుకుని వచ్చి రోజు నిద్రలేవగానే.. నిద్రపోయే ముందు  నిన్ను చూడడం నాకు ఇష్టం.. నా కలలను నేనే నిజం చేసుకుంటా అని అనుకుంటూ ముకుంద.. గుడ్ మార్నింగ్ కాఫీ అని అంటూ మురారీని నిద్ర లేపుతుంది. ఏమిటి కృష్ణ అప్పుడే నా మీద కోపం పోయిందా.. అంటే లేదు కృష్ణే వెళ్ళిపోయింది అంటే.. కృష్ణ ఎక్కడికి వెళ్ళింది.. అంటే తెలియదు ఎక్కడికో చాలా హడావిడిగా కంగారు కంగారుగా వెళ్ళిపోయింది అని ముకుంద చెబుతుంది. తను వెళ్లిన పద్దతి చుస్తే తిరిగి ఇంటికి వచ్చేలా లేదు పోనీలే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు.. ప్రేమ ఉన్నవాళ్లు ఎప్పటికీ మనతో ఉండిపోతారు కాఫీ తాగు అంటూ మురారీకి కాఫీ కప్ ఇస్తుంది. ముకుంద ఎవరైనా చూస్తే దరిద్రంగా ఉంటుంది అంటే.. ఎవరూ చూడకపోతే ఒకే అన్నమాట అని అంటే ముకుంద ప్లీజ్ అంటూ దణ్ణం పెడతాడు. ఎందుకు అంత కంగారు పడతావు మురారీ.. మన విషయం ఎప్పటికైనా తేలాల్సిందే.. ముందు ఇక్కడ నుంచి వెళ్లి.. నువ్వు ఈ కాఫీతాగితే వెళ్తాను అని అంటే.. కాఫీ కప్ తీసుకుని గబగబా తాగుతుంటే అక్కడికి కృష్ణ వస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో

యుద్ధం అయిపోగానే చాలామంది ఇంటికి వచ్చేశారంట.. మరి ఆదర్శ్ ఎందుకు ఇంటికి రావడం లేదు అని మురారీని కృష్ణ అడుగుతుంది.. మరోవైపు ఇష్టం లేని పెళ్లి చేసుకోమని చెప్పడం న్యాయం కదా అని రేవతి ముకుంద ప్రశ్నిస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..