Bandi Sanjay: ఎన్నికల్లో పోటీపై మౌనం వీడిన బండి సంజయ్.. యుద్దానికి సిద్ధం కావాలంటూ కార్యకర్తలకు పిలుపు
కరీంనగర్ అసెంబ్లీ స్థానం లో గత రెండు ఎన్నికల్లో బీజేపీ రెండవ స్థానం లో నిలిచింది. ఇక్కడి నుంచి.. సంజయ్ కుమార్ రెండు సార్లు పోటీ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ గట్టి పోటీ ఇచ్చారు.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తరువాత.. సంజయ్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.. తరువాత రాష్ట్ర అధ్యక్షులు గా బాధ్యత లు చేపట్టారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ మౌనం వీడారు.. మొన్నటి వరకు ఎంపీ గా పోటీ చేస్తానని ప్రకటించిన సంజయ్.. ఇప్పుడు అసెంబ్లీ కి పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు.. వేరు.. వేరుగా ఎన్నికలు జరుగీతే..అసెంబ్లీ పోటీ కి సై అంటున్నారు. తాను నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎక్కడ నుంచి బండి సంజయ్ బరిలోకి దిగనున్నారు పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కరీంనగర్ అసెంబ్లీ స్థానం లో గత రెండు ఎన్నికల్లో బీజేపీ రెండవ స్థానం లో నిలిచింది. ఇక్కడి నుంచి.. సంజయ్ కుమార్ రెండు సార్లు పోటీ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ గట్టి పోటీ ఇచ్చారు.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తరువాత.. సంజయ్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.. తరువాత రాష్ట్ర అధ్యక్షులు గా బాధ్యత లు చేపట్టారు. మరో సారి కరీంనగర్ నుంచి పోటీ చేయడనికి సిద్దమయ్యారు. ఇంతలో అధ్యక్ష బాధ్యత లు తప్పించారు. అయితే అదే సమయంలో బండి సంజయ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పారు.
mla గా కాకుండా mp గా పోటీ చేస్తానని కార్యకర్తలకు మొన్నటి వరకూ సంకేతాలు ఇచ్చారు. మొన్నటి వరకు mp గా పోటి చేస్తానని ప్రకటించారు. మీడియాకు కూడా ఆఫ్ ది రికార్డు లో ఈ విషయాన్నే చెప్పారు.. అయితే తాజాగా కరీంనగర్ లో జరిగిన మీడియా సమావేశంలో.. పోటీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. Mla, mp ఎన్నికలు.. వేరు.. వేరు జరుగితే .. కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే.. ఇటీవల.. గంగుల, సంజయ్ ఒక్కటే అని ప్రచారం సాగుతుంది. మంత్రి గంగుల కోసమే.. సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేయడం లేదనే ప్రచారం సాగింది.
సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రచారం సాగింది. సంజయ్ అసంతృప్తి గ్రూప్ కూడా ఇదే విషయాన్నీ ప్రచారం చేసింది. అంతే కాకుండా.. ఇటీవల సంజయ్ అనుచరులు బీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు. సంజయ్ తన పోటీ విషయం లో క్లారిటీ ఇవ్వకపోవడంతో.. కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. అయితే ఇప్పుడు పోటీ విషయం లో క్లారిటీ ఇచ్చి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో వేములవాడ లో పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే మరోసారీ కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారు బండి సంజయ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..