AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంతమందిని బాధపెడుతూ ఎందుకు బ్రతకాలి.. సూసైడ్ చేసుకోవాలనుకున్నా..! నటి ఎమోషనల్ కామెంట్స్

చాలా మంది హీరోయిన్స్ అనుకోని కారణల వల్ల, వ్యక్తిగత విషయాల వల్ల డిప్రషన్ కు గురవ్వడం వంటివి మనం వార్తల్లో చూస్తుంటాం.. ఇప్పుడు ఓ టాలీవుడ్ నటి కూడా డిప్రషన్ వల్ల చాలా ఇబ్బందిపడ్డా అని తెలిపింది. అంతే కాదు ఆమె సూసైడ్‌కు కూడా ప్రయత్నించా అని తెలిపింది.

ఇంతమందిని బాధపెడుతూ ఎందుకు బ్రతకాలి.. సూసైడ్ చేసుకోవాలనుకున్నా..! నటి ఎమోషనల్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 30, 2026 | 12:14 PM

Share

సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి పాపులర్ అయ్యారు నటి కల్పిక గణేష్. సినిమాలతో కంటే ఈ అమ్మడు ఎక్కువ గ వివాదాలతోనే పాపులర్ అయ్యింది. చాలా సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా, లేదా హీరో ఫ్రెండ్ గా కనిపించి మెప్పించిన కల్పిక ఆ మధ్య రెండు మూడు వివాదాల్లో చిక్కుకున్నారు. పలు వివాదాల తర్వాత కల్పిక గణేష్ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కల్పిక గణేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, వ్యక్తిగత పోరాటాలను ఆమె ధైర్యంగా పంచుకున్నారు. సినీ పరిశ్రమలో కొత్త నటీమణుల నుండి ఎస్టాబ్లిష్డ్ నటీమణుల వరకు అనేకమంది కాస్టింగ్ కౌచ్ వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కల్పిక గణేష్ తెలిపారు.

అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు..

తన కెరీర్ ప్రారంభంలో ఈ పరిశ్రమ ఎలా పనిచేస్తుందో తెలియక, కొన్ని చోట్ల అలాంటి ప్రయత్నాలను ఎదుర్కొన్నానని అన్నారు. అయితే, తాను వారి అంచనాలకు తగ్గట్టుగా పనిచేయలేదని వారికి అర్థమైన తర్వాత, ఆమెను పెద్దగా ఎవరూ సంప్రదించలేదని తెలిపింది. కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నప్పుడు నేను ఇలా పనిచేయను అని ముఖం మీదే చెప్పేసి, కొన్ని ప్రాజెక్టుల నుండి వాకౌట్ చేసినట్లు తెలిపారు కల్పిక. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది అవకాశాలను కోల్పోతామనే భయంతోనో లేదా అనవసరమైన డ్రామా వద్దు అనుకునో మౌనంగా ఉంటారని ఆమె అన్నారు.

గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా లేదా సైడ్ యాక్టరుగా చేసినప్పుడు, తాను హీరోయిన్ కంటే బాగున్నాను, పొడవుగా ఉన్నాను, బాగా మాట్లాడగలను అనే కారణాలతో సైడ్‌లైన్ చేశారని కల్పిక చెప్పారు. ఆ తర్వాతే ప్రధాన పాత్రల కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నానని, దానికి కొంత సమయం పట్టిందని అన్నారు. తాను కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలని ఉందని.. అలాంటి పాత్రలు తెలుగులో తక్కువగా ఉన్నాయని, కానీ ప్రస్తుతం పరిశ్రమలో మార్పు వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. యశోద, అథర్వ వంటి చిత్రాలలో తనకు మంచి పాత్రలు లభించాయని గుర్తు చేసుకున్నారు. అలాగే ఆమె మాట్లాడుతూ..కొన్ని వ్యక్తిగత విషయాలు తనను తీవ్రమైన డిప్రెషన్‌లోకి నెట్టేశాయని, ఆరు నెలల పాటు తన జీవితంలో అత్యంత కష్టమైన దశను అనుభవించానని, తన 36-37 ఏళ్ల జీవితం ఓ ఆరు నెలల్లో తలకిందులైందని వివరించారు. దీని ప్రభావం తన కుటుంబం, స్నేహితులు, సన్నిహితులందరిపై పడిందని చెప్పారు. ఆసమయంలో నేను ఎందుకు బ్రతకలి అని అనిపించింది. సూసైడ్ అటెంప్ట్ కూడా చేశా.. ఆతర్వాత హాస్పటల్ లో జాయిన్ అయ్యాను అని తెలిపారు కల్పిక. విపరీతమైన ఒత్తిడి, తెలియకుండానే తీసుకున్న మందుల వల్ల తన శరీరంపై తీవ్ర ప్రభావం పడిందని, చివరికి కుడి కాలు పక్షవాతానికి గురైందని, సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని కల్పిక ఎమోషనల్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

చూడటానికి పెద్ద అంకుల్.. కానీ నాతో అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..