Andhra Pradesh: ఎత్తైన కొండపై లోతైన గొయ్యి.. అనుమానంగా ఇద్దరు వ్యక్తులు.. దగ్గరకు వెళ్లి చూస్తే షాక్..!
ఎత్తైన కొండ ప్రాంతం.. ఒంటరిగా వెళ్ళాలన్నా దైర్యం చెయ్యలేని ప్రాంతం.. పశువుల కాపరులైనా ఒకరికి ఒకరు తోడుగా వెళ్లాల్సిందే..! అలాంటి చోట ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో మేకలు తోలుకుని వెళ్లిన కాపరులు, ఆ వ్యక్తులను వెంబడించే ప్రయత్నం చేసినా కణాల్లో అక్కడి నుంచి మాయమయ్యారు. వారు చేసిన పనిని చూసిన మేకల కాపరులు షాక్ అయ్యారు.

ఎత్తైన కొండ ప్రాంతం.. ఒంటరిగా వెళ్ళాలన్నా దైర్యం చెయ్యలేని ప్రాంతం.. పశువుల కాపరులైనా ఒకరికి ఒకరు తోడుగా వెళ్లాల్సిందే..! అలాంటి చోట ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో మేకలు తోలుకుని వెళ్లిన కాపరులు, ఆ వ్యక్తులను వెంబడించే ప్రయత్నం చేసినా కణాల్లో అక్కడి నుంచి మాయమయ్యారు. వారు చేసిన పనిని చూసిన మేకల కాపరులు షాక్ అయ్యారు. వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
జెన్ జడ్ గా చెప్పుకునే నేటి రోజుల్లో కొందరు మూడ నమ్మకాలతో క్షుద్ర పూజలను నమ్ముతున్నారు. సులువగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో మోసగాళ్ల మాటలు నమ్మి గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలంటూ తిరుగుతున్నారు. ఇలాంటి ఘటనలతో స్థానిక ప్రజానీకం భయందోళనలకు గురవుతున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే నెల్లూరు జిల్లా సంగం మండలం కోరిమెర్ల గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
సంగం–కొరిమెర్ల రహదారి సమీపంలోని కొండ ప్రాంతంలో భారీగా తవ్విన సొరంగం లాంటి గుంత కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా వంద అడుగుల కంటే ఎక్కువ లోతుగా గుంత తవ్వినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటన తీవ్ర భయందోళనకు గురించేసింది. ఈ గుంత తవ్విన ప్రాంతం వద్ద పూజా సామగ్రి కనిపించడంతో షాక్ అవుతున్నారు. కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అగరబత్తులు పసుపు కుంకుమ అలాగే తవ్వేందుకు ఉపయోగించిన పనిముట్లు అక్కడే పడి ఉండటంతో ఇవి సాధారణ తవ్వకాలు కాదని గుప్తనిధుల కోసమే అక్రమంగా తవ్వకాలు చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొందరు మేకల కాపారులకు మేకలు తోలుకొని సంఘటన జరిగిన ప్రాంతం వైపు వెళ్ళగా అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు కనపడగా వెంటనే అప్రమత్తమైన మేకల కాపారులు తోటి వారికి సమాచారం ఇచ్చారు. వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆ ఇద్దరు అక్కడి నుంచి హడావుడిగా పరారైనట్లు మేకల కాపరులు తెలిపారు. ఒకరు మాంత్రికుడి వేష ధారణలో.. మరొకరు గుంత తవ్విన వ్యక్తిగా చెబుతున్నారు.
మేకల కాపారుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై రాజేష్ గుంతను, అక్కడ ఉన్న సామగ్రిని పరిశీలించి ఆగంతుకులు తవ్విన గుంత చాలా లోతుగా ఉండడంతో పశువులు కానీ మనుషులు అందులో పడితే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున గుంత చుట్టూ భద్రతా ఏర్పాట్లను చేశారు. గుర్తుతెలియని ఆగంతుకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని పోలీసులు భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగినా, అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా వెంటనే తమకు సమాచారం ఇవ్వమని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
సిద్ధార్థ స్కూల్ సమీపంలో క్షుద్ర పూజలు
మరోవైపు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం సిద్ధార్థ స్కూల్ సమీపంలో క్షుద్ర పూజల కలకలం సృష్టిస్తున్నాయి. మనిషి ఆకార బొమ్మలు వేసి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. నడిరోడ్డుపై ముగ్గులు వేసి, నిమ్మకాయలు, బొగ్గులతో పూజలు చేశారు. ఉదయం ఘటనను చూసిన గ్రామస్తుల్లో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు అనుమానాలతో భయాందోళన నెలకొన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
