కప్పు వేడి వేడి టీ నీళ్లు గొంతు తడపందే మనలో చాలా మందికి రోజు ప్రారంభంకాదు. అద్భుతమైన సమ్మేళనాలతో నిండిన టీ మోతాదులో తీసుకుంటే ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చట
TV9 Telugu
మెదడు శక్తి పెరగడం, గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు టీని తాగే వారు ఎక్కువ కాలం జీవిస్తారని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
టీలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో, శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీర శ్రేయస్సును పెంచడంలో ఇది సహాయపడుతుంది
TV9 Telugu
టీ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న కారణంగా దీనిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది
TV9 Telugu
టీ ని తాగడం వల్ల మరణ ప్రమాదం 9 నుండి 13 శాతం వరకు తక్కువని నిపుణులు అంటున్నారు. టీ తాగడం వల్ల సహజమైన ఉత్తేజం వస్తుంది. దీనిలో కెఫిన్ , ఎల్- థియనిన్ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది
TV9 Telugu
టీ లో ఉండే ఎల్- థియనిన్ అనే ఆమైనో అమ్లం ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. టీ మెదడుకు ఒక అద్భుతమైన పానీయంలా పని చేస్తుంది
TV9 Telugu
టీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. హెర్బల్ టీలను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బ్లాక్ టీ వాసన చూడడం చూస్దేనే ఒత్తిడి దూరమవుతుంది
TV9 Telugu
టీ అనగానే పాలు, చక్కెర, టీ పొడి వేసే తయారు చేసే టీ అనుకుంటారు చాలా మంది కానీ హెర్బల్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ వంటి వాటిని తీసుకున్నప్పుడే మనం ఈ ప్రయోజనాలను పొందవచ్చు