Asha Parekh : దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికైన అలనాటి అందాల తార ఆశా పరేఖ్‌ గురించి మీకు ఈవిషయాలు తెలుసా..?

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికైన అలనాటి అందాల తార ఆశా పరేఖ్‌ గురించి ఈ తరం వారికి అంతగా తెలియపోవచ్చు కానీ ఒకప్పుడు ఆమె లేడి సూపర్‌స్టార్‌ ... అంతకంటే ఎక్కువే

Asha Parekh : దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికైన అలనాటి అందాల తార ఆశా పరేఖ్‌ గురించి మీకు ఈవిషయాలు తెలుసా..?
Asha Parekh
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 27, 2022 | 5:03 PM

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికైన అలనాటి అందాల తార ఆశా పరేఖ్‌ గురించి ఈ తరం వారికి అంతగా తెలియపోవచ్చు కానీ ఒకప్పుడు ఆమె లేడి సూపర్‌స్టార్‌ … అంతకంటే ఎక్కువే! తను రాసుకున్న ఆత్మకథకు ఆమె ద హిట్‌ గర్ల్‌ అనే పేరు పొగరుగా పెట్టుకోలేదు. నిజంగానే ఆమె పెద్ద హీరోయిన్‌.. ఆమె నటించిన సినిమాలన్నీ హిట్లే.. అప్పటి హీరోయిన్లందరి కంటే ఎక్కువ రెమ్యూనిరేషన్‌ తీసుకున్నది కూడా ఆశా పరేఖే! ఆమెకు మన దేశంలోనే కాదు. మిగతా దేశాల్లో కూడా బోలెడంత మంది అభిమానులున్నారు. 2004 జులైలో ఇరాఖ్‌లో ఓ సంఘటన జరిగింది. బ్లాక్‌ బ్యానర్‌ అనే ఇరాకీ గెరిల్లా సంస్థ అక్కడ పని చేస్తున్న విదేశీయులపై తరచూ దాడులు చేస్తుండేది. ఇలాగే కువైట్‌ గల్ఫ్‌ లింక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అనే కంపెనీకి చెందిన వాహనాలపై కూడా దాడులు చేసింది. డ్రైవర్లను కిడ్నాప్‌ చేసింది. వారిని విడుదల చేయడానికి కొన్ని డిమాండ్లను తీర్చాలంటే షరతులు విధించింది.

ఆ డ్రైవర్లంతా భారతీయులు కావడంతో మనకు ఇబ్బందులు వచ్చాయి. వెంటనే భారత ప్రభుత్వం కిడ్నాపర్లతో మాట్లాడింది. ఇరాక్‌లోని ట్రైబల్‌ లీడర్లకు అధినేతగా ఉన్న షేక్‌ హిషామ్‌ దులైమీ అనే ఇరాఖీ ప్రముఖుడిని మీడియేటర్‌గా ఉండమని కిడ్నాపర్లు కోరారు. అతడి మాటకు అక్కడ తీరుగుండదు. ఎంత చెబితే అంత! ఈ నేపథ్యంలోనే అవుట్‌లుక్‌ పత్రిక ప్రతినిధి ఆయనను కలిశారు. ఇద్దరూ అనేక విషయాలను మాట్లాడుకున్నారు. ఈ సందర్భంలోనే తనకు హిందీ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పాడు షేక్‌ హిషామ్‌ దులైమీ. ఆశా పరేఖ్‌ అంటే చచ్చేంత ఇష్టమని, ఆమె కనుక తనకు ఒక్కసారి ఫోన్‌ చేసి రిక్వెస్ట్ చేస్తే కిడ్నాపర్ల చేతుల్లో బందీలుగా ఉన్నవారంతా ఈ రోజు విడుదలయ్యేట్టు చూస్తానని అన్నాడు.. ఇప్పుడర్థయ్యింది కదా! ఆశా పరేఖ్‌ అంటే ఎంతటి క్రేజో!

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?

మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..

యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?

అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..

నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?

ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్

ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..

చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!