Tollywood: ఈ వారం థియేటర్లలోకి వచ్చేస్తోన్న సినిమాలు ఇవే.. చిన్న చిత్రాలదే హవా..

దసరా పండగ సందడి ముగిసింది. భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా ఈసారి పండక్కి చిన్న సినిమాల హవా కొనసాగింది. ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లు రాబట్టాయి పలు చిత్రాలు. ఇక ఇప్పుడు అక్టోబర్ మూడో వారం కూడా చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. ఇప్పుడు థియేటర్లలో మరిన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఇంతకీ అవెంటో తెలుసుకుందామా.

Tollywood: ఈ వారం థియేటర్లలోకి వచ్చేస్తోన్న సినిమాలు ఇవే.. చిన్న చిత్రాలదే హవా..
Tollywood Movies
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 14, 2024 | 11:02 AM

దసరా పండగ సందడి ముగిసింది. భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా ఈసారి పండక్కి చిన్న సినిమాల హవా కొనసాగింది. ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లు రాబట్టాయి పలు చిత్రాలు. ఇక ఇప్పుడు అక్టోబర్ మూడో వారం కూడా చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. ఇప్పుడు థియేటర్లలో మరిన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఇంతకీ అవెంటో తెలుసుకుందామా.

లవ్ రెడ్డి.. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి కీలకపాత్రలలో నటిస్తున్న లేటేస్ట్ సినిమా లవ్ రెడ్డి. ఈ మూవీ అక్టోబర్ 18న అడియన్స్ ముందుకు రానుంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

సముద్రుడు.. రమాకాంత్, అవంతిక, భాను శ్రీ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా సముద్రుడు. నగేశ్ నారదాసి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మత్య్సకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించారు. అక్టోబర్ 18న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

వీక్షణం.. రామ్ కార్తీక్, కశ్వి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వీక్షణం. డైరెక్టర్ మనోజ్ పల్లేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 18న రిలీజ్ చేయనున్నారు. 8 నెలల క్రితం చనిపోయిన అమ్మాయితో హీరో ప్రేమలో పడిన తర్వాత ఏం జరిగిందన్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

రివైండ్.. సాయి రోనక్, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా రివైండ్. కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అక్టోబర్ 18న రిలీజ్ చేయనున్నారు. తన ప్రేమను గెలిపించుకోవడానికి టైమ్ మెషీన్ లో ప్రయాణించి ఏం చేశాడన్నదే కథ.

ఖడ్గం.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ ఖడ్గం. 2002లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించగా.. ఇప్పుడు అక్టోబర్ 18న మరోసారి రిలీజ్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌