గ్లామర్‌ వరల్డ్‌లో క్యాన్సర్ ఫియర్స్‌.. ఈ మహమ్మారి బారినపడిన వారు వీరే

సాండల్‌ వుడ్ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌ చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. కొంత కాలంగా క్యాన్సర్‌ తో బాధపడుతున్న శివన్న, పూర్తి ఆరోగ్యంతో మళ్లీ తిరిగి వస్తానన్న హామీ ఇస్తూ చికిత్స కోసం వెళ్లారు. శివన్నకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా లో వైరల్ కావటం తో గతంలో ఇలా కేన్సర్ బారిన పడిన ఇండస్ట్రీ ప్రముఖులను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌.

గ్లామర్‌ వరల్డ్‌లో క్యాన్సర్ ఫియర్స్‌.. ఈ మహమ్మారి బారినపడిన వారు వీరే
Actress
Follow us
Satish Reddy Jadda

| Edited By: Rajeev Rayala

Updated on: Dec 20, 2024 | 7:50 PM

బాలీవుడ్ ఇండస్ట్రీ లో క్యాన్సర్ మహమ్మారి విషాదాన్ని నింపింది. ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్‌ కు తీసుకెళ్లిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్‌ తో పోరాడుతూను మరణించారు. కోలుకొని తిరిగి వస్తారనుకుంటున్న టైమ్‌ లో ఆయన మరణం అభిమానులను షాక్‌ కు గురి చేసింది. హిందీ ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా ఓ వెలిగిన రిషి కపూర్‌ కూడా క్యాన్సర్‌ తో పోరాడుతూనే మరణించారు.

ఇది కూడా చదవండి :అప్పుడు బాడీ షేమింగ్ అవమానాలు.. ఇప్పుడు నోరెళ్ళబెట్టి చూసే సోయగం.. స్టార్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ

క్యాన్సర్‌ మహమ్మారిని ధైర్యంగా ఎదిరించి గెలిచిన ఫిలిం స్టార్స్‌ కూడా చాలా మందే ఉన్నారు. రీసెంట్ టైమ్స్‌ లో గౌతమి, సోనాలి బింద్రే లాంటి హీరోయిన్స్ ఈ మహ్మారిని జయించారు. కెరీర్‌ కు గుడ్‌ బై చెప్పిన తరువాత క్యాన్సర్ బారిన పడిన బ్యూటీస్‌, ఆరోగ్యంగా తిరిగి వచ్చాక మళ్లీ గ్లామర్ ఫీల్డ్‌ లో బిజీ అయ్యారు.

కెరీర్‌ లో మంచి ఫామ్‌ లో ఉన్న టైమ్‌ లోనే క్యాన్సర్‌ బారిన పడ్డారు హాట్ బ్యూటీ మమతా మోహన్‌ దాస్. హీరోయిన్‌ గా, సింగర్‌ గా ఫుల్ బిజీగా ఉన్న టైమ్‌ లో క్యాన్సర్ రావటంతో మమతా జీవితం తలకిందులైంది. సుధీర్ఘ కాలం చికిత్స తీసుకున్న తరువాత కోలుకున్న మమతా, మళ్లీ గ్లామర్ ఫీల్డ్‌ లోనూ సత్తా చాటుతున్నారు.

ఇది కూడా చదవండి :Venu Swamy: నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం మొదలయ్యింది.. ఇంకా జరుగుతాయి

ఈ మధ్య సీనియర్ హీరోయిన్‌ మనిషా కొయిరాల కూడా క్యాన్సర్‌ ను జయించారు. దాదాపు ఏడాది పాటు అమెరికాలో చికిత్స పొందిన తరువాత ఆమె కోలుకున్నారు. క్యాన్సర్‌ ను జయించిన తరువాత మళ్లీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు మనీషా.

తొలి తరం నటీనటుల్లోనూ చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డారు. నర్గీస్‌ దత్‌, ముంతాజ్‌ లాంటి సీనియర్ హీరోయిన్స్‌ తో పాటు బాలీవుడ్ లెజెండరీ స్టార్‌ రాజేష్‌ ఖన్నా కూడా క్యాన్సర్‌ తో పోరాడుతూనే తుది శ్వాస విడిచారు. వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన స్టార్స్ ఇలా క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతుండటం ఇండస్ట్రీ ప్రముఖులను కూడా కలవరపెడుతోంది. భవిష్యత్తు తరలా తారలైన ఇలాంటి వ్యాదుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.