AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప గాడి రూల్.. వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్..

వందేళ్ల హిందీ సినిమా చరిత్రను తిరగరాశారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. 'పుష్ప-2' ది రూల్‌ వైల్డ్‌ ఫైర్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌తో బాలీవుడ్‌లో అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు భారీ వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది పుష్ప 2.

Pushpa 2: పుష్ప గాడి రూల్.. వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్..
Pushpa 2
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2024 | 7:33 PM

Share

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప-2’ ది రూల్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. ఈ చిత్రం విడుదలకు ముందే పలు కొత్త రికార్డులను క్రియేట్‌ చేసిన ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ మూవీ విడుదల తరువాత సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. విడుదలైన తొలిరోజే నుంచే అన్ని ఏరియాల్లో కలెక్షన్స్‌ విషయంలో ఆల్‌టైమ్‌ రికార్డులు నెలకొల్పుతున్న పుష్ప-2 ది రూల్‌ బాక్సాఫీస్‌ వద్ద తన హవా కొనసాగిస్తుంది.

ఇది కూడా చదవండి :అప్పుడు బాడీ షేమింగ్ అవమానాలు.. ఇప్పుడు నోరెళ్ళబెట్టి చూసే సోయగం.. స్టార్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ

ముఖ్యంగా వందేళ్ల హిందీ సినీ చరిత్రలో ‘పుష్ప-2’ చిత్రంతో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తున్నాడు. ఇప్పటి వరకు హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్‌ చేయని విధంగా కేవలం 15 రోజుల్లోనే 632 కోట్ల 50 లక్షల రూపాయాల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘పుష్ప-2′ దిరూల్‌ ఆ ఘనతను దక్కించుకుంది. ఇప్పటి వరకు హాయ్యెస్ట్‌ వసూళ్లను సాధించిన చిత్రంగా ఉన్న’స్త్రీ2’ చిత్రం లైఫ్‌ టైమ్‌ రన్‌ను కేవలం 15 రోజుల్లోనే పుష్ప-2 అధిగమించడం విశేషం. దీంతో పాటు అత్యంత వేగంగా 14 రోజుల్లోనే రూ.1500 కోట్ల రూపాయాలు సాధించిన తొలి భారతీయ చిత్రంగా, కేవలం ముంబయ్‌లోనే 200 కోట్ల రూపాయాల నెట్‌ను వసూలు చేసిన తొలిచిత్రంగా పుష్ప-2 రికార్డు క్రియేట్‌చేసింది.

ఇది కూడా చదవండి :Venu Swamy: నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం మొదలయ్యింది.. ఇంకా జరుగుతాయి

ఇక 2024 సంవత్సరంలో హ్యాయ్యెస్ట్‌ గ్రాస్‌ను సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డును నమోదు చేసింది. అల్లు అర్జున్‌ తన కెరీర్‌లో పుష్ప ది రైజ్‌, పుష్ప ది రూల్‌ చిత్రాలతో 2021 మరియు 2024లో బ్యాక్‌ టు బ్యాక్‌ హ్యాయెస్ట్‌ గ్రాసర్స్‌ వసూలు చేసిన ఇండియన్‌ సినిమాల హీరోగా కూడా కొత్త రికార్డను సాధించాడు. భవిష్యత్‌లో పుష్ప-2 ది రూల్‌ లాంగ్‌ రన్‌లో మరిన్ని సరికొత్త రికార్డులు ఐకాన్‌ స్టార్‌ సొంతం చేసుకోబోతున్నాడని అంటున్నాయి ఇండియన్‌ ట్రేడ్‌ వర్గాలు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో