Thellavarithe Guruvaram Review: అలరిస్తున్న ‘తెల్లవారితే గురువారం’.. నటనతో ఆకట్టుకున్న సింహా..

ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి తనయుడు, యుంగ్ మ్యూజిక్ కంపోజర్ కాల భైరవ తమ్ముడు, యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ఈ యంగ్ హీరో తొలి చిత్రం ‘మత్తు వదలరా’ తో గుర్తింపు తెచ్చుకున్నాడు.

Thellavarithe Guruvaram Review: అలరిస్తున్న ‘తెల్లవారితే గురువారం’.. నటనతో ఆకట్టుకున్న సింహా..
Thellavarithe Guruvaram
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Mar 29, 2021 | 2:06 PM

నటీనటులు: సింహా-చిత్ర శుక్లా-నిమిషా సింగ్-సత్య-వైవా హర్ష-రాజీవ్ కనకాల తదితరులు సంగీతం: కాలభైరవ నిర్మాతలు: రజని కొర్రపాటి-రవీంద్ర బెనర్జీ స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మణికాంత్ గెల్లి

ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి తనయుడు, యుంగ్ మ్యూజిక్ కంపోజర్ కాల భైరవ తమ్ముడు, యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ఈ యంగ్ హీరో తొలి చిత్రం ‘మత్తు వదలరా’ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తెల్లవారితే గురువారం అనే సినిమా చేశాడు. మణికాంత్ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాల భైరవ సంగీతమందించాడు. ఈ సినిమా మార్చి 27మన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాఎలా ఉందంటే..

కథ : 

వీరు (శ్రీసింహా) తండ్రి మాట కాద‌న‌లేక పెళ్లికి సిద్దమవుతాడు. తెల్లారితే ముహూర్తం. కానీ పెళ్లి మండపం నుంచి పెళ్లికొడుకు పారిపోతాడు. ఒక ఫోన్ కాల్ రావ‌డంతో బ్యాగ్ స‌ర్దేసుకుని పెళ్లిమండపం నుంచి బ‌య‌ట ప‌డ‌తాడు. ఇదే ఓ ఝ‌ల‌క్ అనుకుంటే… సేమ్ టు సేమ్ పెళ్లి కూతురు మ‌ధు (మిషా నారంగ్‌) కూడా బ్యాగ్ స‌ర్దేసుకుని బ‌య‌ల్దేరుతుంది. అలా పెళ్లికొడుకు, పెళ్లికూతురు క‌లుస్తారు. ఒక‌రి స‌మ‌స్య గురించి మ‌రొక‌రు తెలుసుకుంటారు ఆతర్వాత సిటీ చేరుకుంటారు. అక్క‌డికి వెళ్లాక ఏం జ‌రిగింది? ఇంత‌కీ ఈ ఇద్ద‌రికీ పెళ్ల‌యిందా లేదా? అనేదే  తెరపైన చూడాల్సిందే.

ఎవరెలా చేసారంటే.. 

హీరో సింహాలో మంచి ఈజ్ కనిపించింది. ‘తెల్లవారితే గురువారం’లో చాలా ఉత్సహంగా నటించాడు. వీరు పాత్రను సులువుగా చేసుకుపోయాడు. లుక్స్ పరంగా కూడా అతను ఆకట్టుకున్నాడు సింహా. చిత్రా శుక్లా చూడ్డానికి చాలా బాగుంది. నటన పరంగాను పర్వాలేదు. ఆమె పాత్ర కొంత వరకు బాగానే అనిపిస్తుంది. సత్యకు మంచి పాత్ర పడింది. అతడి పాత్ర కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుల్లో ఒక ఆశ కలుగుతుంది. ఈ పాత్ర ఇంకొంతసేపు ఉంటే బాగుండనిపిస్తుంది. వైవా హర్ష సైతం ఉన్నంతలో బాగానే నవ్వించాడు. మిగతా పాత్రలు.. నటీనటులంతా తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. పాట‌ల కంటే కూడా నేప‌థ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు కాల‌భైర‌వ. సురేష్ ర‌గుతు కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. వారాహి స్థాయిలో నిర్మాణ విలువ‌లు ఉన్నాయి. ద‌ర్శ‌కుడు మ‌ణికాంత్ ప‌నిత‌నం కొన్ని స‌న్నివేశాల్లోనే క‌నిపించింది. పాత్ర‌ల్ని డిజైన్ చేసుకున్న విధానానికి ఆయ‌నకి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. నాగేంద్ర ర‌చ‌న ప్ర‌భావం మాట‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

చివరిగా : మెప్పించిన ‘తెల్లవారితే గురువారం’

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jathi Ratnalu movie : బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న నవీన్ పోలిశెట్టి సినిమా.. రికార్డుల వేట కొనసాగిస్తున్న జాతిరత్నాలు..

Actress Taapsee: సోషల్ మీడియాలో ట్రోల్స్.. సీరియస్‌గా స్పందించిన తాప్సీ.. వారిని ట్రోల్ చేయరేం అంటూ నిలదీత..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu