AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమ్ముడిని బీట్ చేయాలంటే సాయి ధరమ్ తేజ్ కష్టపడాల్సిందేనా… ‘రిపబ్లిక్’ సినిమాపై భారీ అంచనాలు

చిత్రల‌హ‌రి, ప్ర‌తిరోజూ పండ‌గే , సోలో బ్రతుకే సో బెటర్ వంటి వ‌రుస విజయాల‌తో దూసుకెళ్తోన్న సుప్రీమ్ హీరో సాయితేజ్ కథానాయకుడిగా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు దేవ్‌ కట్ట డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న

తమ్ముడిని బీట్ చేయాలంటే సాయి ధరమ్ తేజ్ కష్టపడాల్సిందేనా... 'రిపబ్లిక్' సినిమాపై భారీ అంచనాలు
Sai Tej
Rajeev Rayala
|

Updated on: Mar 27, 2021 | 9:44 PM

Share

‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి వ‌రుస విజయాల‌తో దూసుకెళ్తోన్న సుప్రీమ్ హీరో సాయితేజ్ కథానాయకుడిగా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు దేవ్‌ కట్ట డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’. ఇటీవల ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఫ‌స్ట్ లుక్‌లో హీరో సాయితేజ్ కూలింగ్ గ్లాస్ వేసుకుని క‌నిపిస్తున్నారు. ఈ లుక్‌తో ఆడియెన్స్‌లో ఓ క్యూరియాసిటినీ క్రియేట్ చేశారు డైరెక్ట‌ర్ దేవ్‌క‌ట్ట‌. ఫ‌స్ట్‌లుక్‌ను ప‌రిశీలిస్తే… కూలింగ్ గ్లాస్‌లో హీరో ఎవ‌రితో చ‌ర్చ‌లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. భార‌త‌దేశం స్వాతంత్య్రాన్ని సాధించి 74 ఏళ్లు అవుతుంది. “డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంతుందో కూడా తెలీదు మనకు” అనుకుని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేసే అభి అనే యువ‌కుడిగా సాయితేజ్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. అయితే వరుసగా రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కాగా సోలో బ్రతుకే సోబెటర్ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కు పోటీగా తమ్ముడు వైష్ణవ్ తేజ్ వచ్చాడు. ఇటీవల ఉప్పెన సినిమాతో ఈ కుర్రహీరో సంచలన హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు ఎంత లేదన్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ హిట్లు అందుకోవాలి. మరి ఇప్పుడు రిపబ్లిక్ సినిమా పైన అంచనాలు భారీగా ఉన్నాయి. చూడాలి మరి రిపబ్లిక్ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాను జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై  నిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జూన్ 4న విడుదల చేస్తున్నారు. ఐశ్వ‌ర్యా రాజేశ్ తేజకు జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో విలక్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

పురుషుడి ప్రైవేట్ పార్ట్‌పై శాస్త్రవేత్త కామెంట్.. వ్యంగ్యంగా రియాక్ట్ అయిన బాలీవుడ్ భామ.!

Ramcharan Jani Master couple : చరణ్ బర్త్ డే సందర్భంగా సతీసమేతంగా రక్తదానం చేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దంపతులు

Follow Us