SarangaDariya : సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న సారంగదరియా సాంగ్.. కేవలం 27 రోజుల్లోనే..

టాలీవుడ్ లో లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. అందమైన ప్రేమ కథలను ఎంతో అందంగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరిస్తారు శేఖర్ కమ్ముల. ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమాతో ప్రేక్షకులను అలరించిన శేఖర్ కమ్ముల

SarangaDariya : సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న సారంగదరియా సాంగ్.. కేవలం 27 రోజుల్లోనే..
Sai Pallavi
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 28, 2021 | 9:52 AM

SarangaDariya: టాలీవుడ్ లో లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. అందమైన ప్రేమ కథలను ఎంతో అందంగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరిస్తారు శేఖర్ కమ్ముల. ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమాతో ప్రేక్షకులను అలరించిన శేఖర్ కమ్ముల ఆతర్వాత గోదావరి, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శేఖర్ లవ్ స్టోరీ అనే మరో అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, అందాల భామ సాయిపల్లవి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన సారంగదరియా సాంగ్ సంచలన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పాట మారుమ్రోగుతుంది. తాజాగా సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకుంది ఈ పాట. యూట్యూబ్ లో ఈ పాట ఏకంగా 90మిలియన్ కుయ్ పైగా వ్యూస్ దక్కించుకుంది. కేవలం విడుదలైన 27 రోజుల్లోనే ఈ పాట ఈ రికార్డును సొంతం చేసుకుంది.ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. ఇక ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ జానపద గీతంను మంగ్లీ తదైన శైలిలో ఆలపించింది. ఇక లవ్ స్టోరీ సినిమాను ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫిదా తర్వాత మరోసారి తెలంగాణ నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ షూటింగ్ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది.  ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Thellavarithe Guruvaram Review: అలరిస్తున్న ‘తెల్లవారితే గురువారం’.. నటనతో ఆకట్టుకున్న సింహా..

Jathi Ratnalu movie : బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న నవీన్ పోలిశెట్టి సినిమా.. రికార్డుల వేట కొనసాగిస్తున్న జాతిరత్నాలు..