Actress Anjali: నేను రూల్స్ విధిగా పాటిస్తాను.. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో హీరోయిన్ అంజలి
రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను తప్పనిసరిగా పాటించాలని నిత్యం పోలీసులు చెప్తున్నా కొంతమంది మాత్రం లెక్కచేయకుండా తిరుగుతున్నారు. హెల్మెట్లు ధరించాలంటూ, సీటుబెల్ట్లు పెట్టుకోవాలంటూ నిత్యం పోలీసులు
Actress Anjali: రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను తప్పనిసరిగా పాటించాలని నిత్యం పోలీసులు చెప్తున్నా కొంతమంది మాత్రం లెక్కచేయకుండా తిరుగుతున్నారు. హెల్మెట్లు ధరించాలంటూ, సీటుబెల్ట్లు పెట్టుకోవాలంటూ నిత్యం పోలీసులు ఎదో ఒక రకంగా ఏవైర్నెస్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య సినిమాలోని సన్నివేశాలను పోస్టర్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతే కాదు సినిమా తారలతో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనా కల్పిస్తున్నారు. తాజాగా హీరోయిన్ అంజలి కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చు అని తెలిపింది.
ఇటీవల అంజలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ లో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన అంజలి నగర పోలీసులు ఎంజే మార్కెట్ లో నిర్వహించిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల మనతో పాటు అవతలి వారిని కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతామని అంజలి చెప్పుకొచ్చింది. ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్కరు విధిగా పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని కోరింది అంజలి. అలాగే తాను కూడా ఎప్పుడు కూడా ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తాను. తన డ్రైవర్ కు కూడా విధిగా ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని సూచిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా పోలీసువారు రూపొందించిన మూడు షార్ట్ ఫిల్మ్ లను అంజలి విడుదల చేసింది.
#HYDTPweBringAwareness Today Sri.Anjani Kumar, IPS., @CPHydCity along with Miss Anjali Cine Actress @yoursanjali launched Traffic Farishtey Program and released 3 Traffic awareness short films in the august presence of Sri Anil Kumar, IPS @AddlCPTrHyd @DCPEASTZONE pic.twitter.com/bbH9I6opWB
— Hyderabad Traffic Police (@HYDTP) March 27, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
SarangaDariya : సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న సారంగదరియా సాంగ్.. కేవలం 27 రోజుల్లోనే..
Thellavarithe Guruvaram Review: అలరిస్తున్న ‘తెల్లవారితే గురువారం’.. నటనతో ఆకట్టుకున్న సింహా..