Thalapathy Vijay: వరద బాధితులకు అండగా విజయ్ దళపతి.. నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేత.. వీడియో
మిచాంగ్ తుపాన్ ప్రభావంతో డిసెంబర్ 17,18 తేదీల్లో తమిళ నాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. చెన్నైతో పాటు నెల్లై, తూత్తుకుడి, తెన్‌కాసి, కన్యాకుమారి ప్రాంతాల్లు ముంపునకు గురయ్యాయి. అమీర్ ఖాన్, విష్ణు విశాల్ వంటి స్టార్ హీరోలు కూడా తట్టా బుట్టా సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సివచ్చిందంటే సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. తమిళనాడు వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేశాడు. మిచాంగ్ తుపాన్ ప్రభావంతో డిసెంబర్ 17,18 తేదీల్లో తమిళ నాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. చెన్నైతో పాటు నెల్లై, తూత్తుకుడి, తెన్‌కాసి, కన్యాకుమారి ప్రాంతాల్లు ముంపునకు గురయ్యాయి. అమీర్ ఖాన్, విష్ణు విశాల్ వంటి స్టార్ హీరోలు కూడా తట్టా బుట్టా సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సివచ్చిందంటే సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. భారీ వరదలకు ఇల్లు నేలమట్టం కావడంతో వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించింది. వరదల కారణంగా వేలాది మంది కొన్ని రోజుల పాటు పునరావాస కేంద్రాల్లోనే గడిపారు. ఈ నేపథ్యంలో వరదల్లో నష్టపోయిన ప్రజలకు హీరో దళపతి విజయ్ ఆర్థిక సహాయం అందించాడు. నిత్యావసర సరుకులైన బియ్యం, కూరగాయలు, దుప్పట్లను విజయ తన చేతుల మీదుగా వరద బాధితులకు అందించాడు. తన ఆఫీసులోనే నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలాది మంది సామాన్యులు తరలివచ్చారు.
ఇక వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు విజయ్ ఆర్థిక సహాయం అందించాడని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ ఆర్థిక సహాయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడే కాదు గతంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు విజయ్. తన అభిమానులు, సామాన్యులకు తన చేత నైన సాయం చేస్తూ వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ప్రతిభ గల పేద విద్యార్థినులను ఘనంగా సత్కరించి స్కాలర్ షిప్‌లు కూడా అందజేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. లియోతో బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్న విజయ్. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి 68 (వర్కింగ్ టైటిల్) మూవీలో నటిస్తున్నాడు.
వరద బాధితుల కోసం..
நான் தான் விஜய் 😂❤️ Cute Video #ThalapathyVIJAY #NellaiWelcomesTHALAPATHY@actorvijay
— Actor Vijay Team (@ActorVijayTeam) December 30, 2023
విజయ్ ఆఫీసులోనే సహాయక కార్యక్రమాలు..
நான் தான் விஜய் 😂❤️ Cute Video #ThalapathyVIJAY #NellaiWelcomesTHALAPATHY@actorvijay
— Actor Vijay Team (@ActorVijayTeam) December 30, 2023
ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకుల పంపిణీ..
VIDEO | Actor #Vijay reached Tuticorin earlier today to distribute relief materials to those affected by floods in the district.#Tuticorinflood
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/SNHp9aErHD
— Press Trust of India (@PTI_News) December 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.