Salaar: సీఎం రేవంత్ రెడ్డికి నచ్చేసిన ప్రభాస్‌ ‘సలార్‌’ సాంగ్‌.. ట్వీట్‌ వైరల్‌

ప్రభాస్‌ స్నేహితుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మరో కీలక పాత్రలో మెరిశాడు. ఇక వీరిద్దరి స్నేహం నేపథ్యంగా సాగే 'సూరిడే గొడుగు పట్టి' పాట సినిమా కంటే రిలీజై సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. సోషల్‌ మీడియాలోనూ ఈ సాంగ్‌దే హవా. ముఖ్యంగా ఈ పాటలోని లిరిక్స్‌ ఎంతో భావోద్వేగంతో మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.

Salaar: సీఎం రేవంత్ రెడ్డికి నచ్చేసిన ప్రభాస్‌ 'సలార్‌' సాంగ్‌.. ట్వీట్‌ వైరల్‌
Cm Revanth Reddy, Salaar Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 30, 2023 | 4:07 PM

పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన పవర్‌ ప్యాక్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ సలార్‌. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో దూసుకెళుతోంది. కనివినీ ఎరుగని కలెక్షన్లతో బాక్సాపీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే రూ.550 కోట్లను దాటేసిన సలార్‌ రాబోయే రోజుల్లో మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. సలార్‌లో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. ప్రభాస్‌ స్నేహితుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మరో కీలక పాత్రలో మెరిశాడు. ఇక వీరిద్దరి స్నేహం నేపథ్యంగా సాగే ‘సూరిడే గొడుగు పట్టి’ పాట సినిమా కంటే రిలీజై సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. సోషల్‌ మీడియాలోనూ ఈ సాంగ్‌దే హవా. ముఖ్యంగా ఈ పాటలోని లిరిక్స్‌ ఎంతో భావోద్వేగంతో మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. అందుకే సలార్‌ పాటను తమకు నచ్చినట్టుగా ఎడిట్‌ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్‌కు తగ్గట్టుగా వారి పార్టీ కార్యకర్తలు, అభిమానులు సలార్‌ పాటను ఎడిట్‌ చేసి నెట్టింట ట్రెండ్‌ చేస్తున్నారు. ఇలా ఎంతోమంది మనసులను తాకిన సలార్‌ సాంగ్‌ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా మెప్పించింది.

వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సీఎం రేవంత్‌ రెడ్డి అక్కడ సాదర స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో తనకు లభించిన గౌరవాన్ని, అలాగే కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీతో తనకున్న అనుబంధాన్ని తెలియజేసేందుకు సీఎం రేవంత్‌ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. విశేషమేమిటంటే.. ఈ వీడియో బ్యాక్‌ గ్రౌండ్లో ప్రభాస్‌ సలార్‌ సాంగ్‌ను పెట్టడం. అంతే కాదు.. సూరిగే గొడుగు పట్టి పాటలోని కొన్ని లిరిక్స్‌ను కూడా ట్వీట్‌లో జత చేశారు రేవంత్ రెడ్డి. ‘వేగమొకడు..త్యాగమొకడు.. గతము మరువని గమనమే..ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే.. ఒకరు గర్జన.. ఒకరు ఉప్పెన..వెరసి ప్రళయాలే.. సైగ ఒకరు.. సైన్యం ఒకరు కలిసి కదిలితే కదనమే’ అంటూ సలార్‌ సాంగ్ లిరిక్స్‌ను రాసుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సలార్‌ పాట సీఎం రేవంతన్నకు కూడా నచ్చేసిందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌