Thalapathy Vijay: ఆ హీరోయిన్ కోసం రెండు ఐపీఎల్ టికెట్లు కొన్న దళపతి విజయ్.. ఆమె ఎవరో తెలుసా?

. కొన్ని నెలల క్రితమే అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ ఒక రాజకీయ పార్టీని కూడా ప్రకటించాడు. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. రాజకీయాలకు పూర్తి సమయం కేటాయించేందుకు త్వరలో చిత్ర పరిశ్రమకు కూడా గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం

Thalapathy Vijay: ఆ హీరోయిన్ కోసం రెండు ఐపీఎల్ టికెట్లు కొన్న దళపతి విజయ్.. ఆమె ఎవరో తెలుసా?
Thalapathy Vijay
Follow us
Basha Shek

|

Updated on: May 10, 2024 | 7:31 PM

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం అటు సినిమా పనుల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ బిజీబిజీగా ఉంటున్నాడుc. ఇదిలా ఉండగా విజయ్ దళపతి ప్రముఖ స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కోసం రెండు ఐపీఎల్ టిక్కెట్లు కొన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా వరలక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘నేను చూసిన మొదటి రెండు ఐపీఎల్ మ్యాచ్‌ల టిక్కెట్లు దళపతి విజయ్ కొన్నాడు. తొలి మ్యాచ్ చెన్నైలో జరిగింది. ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే జట్లు ఈ పోటీలో తలపడ్డాయి’ అని వరలక్ష్మి చెప్పుకొచ్చింది.

కాగా వరలక్ష్మి శరత్‌కుమార్ తమిళం తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఇటీవలే పాన్ ఇండియా హిట్ మూవీ ‘హనుమాన్’ సినిమాలో హీరో తేజ సజ్జా సోదరిగా నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే, నికోలాయ్ సహదేవ్‌తో వరలక్ష్మి శరత్‌కుమార్ నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే ఈ ప్రేమ పక్షులు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

వరలక్ష్మీ శరత్ కుమార్ కోసం..

ఇక దళపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా 80 రష్యాలోనే చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, మోహన్, జయరామ్ తదితరులు నటించారు. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో విజయ్ ద్విపాత్రాభియనం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశముందని కోలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

గోట్ సినిమాలో దళపతి విజయ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.