AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamitha Baiju: వామ్మో.. ఇదేం మాస్ డ్యాన్స్ రా బాబు.. కాలేజీలో ఇరగదీసిన ప్రేమలు హీరోయిన్..

ప్రేమలు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీని దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తీకేయ తెలుగుకి తీసుకువచ్చారు. రిలీజ్ అయిన మొదటి రోజే భారీ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇందులో కథానాయికగా నటించిన మమితా బైజుకు వచ్చిన ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ కుర్రాళ్లు ఈ బ్యూటీకి

Mamitha Baiju: వామ్మో.. ఇదేం మాస్ డ్యాన్స్ రా బాబు.. కాలేజీలో ఇరగదీసిన ప్రేమలు హీరోయిన్..
Mamitha Baiju
Rajitha Chanti
|

Updated on: May 10, 2024 | 5:18 PM

Share

కేవలం ఒకే ఒక్క సినిమాతో దక్షిణాదిలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది మమితా బైజు. అంతకు ముందు మలయాళంలో అనేక చిత్రాల్లో నటించింది. కానీ ఇటీవల ఒక్క సినిమాతోనే ఇటు టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిలో పడిపోయింది. అంతేకాదు.. తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవిగా మారిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ అనుకుంటున్నారా ?.. అదే ప్రేమలు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీని దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తీకేయ తెలుగుకి తీసుకువచ్చారు. రిలీజ్ అయిన మొదటి రోజే భారీ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇందులో కథానాయికగా నటించిన మమితా బైజుకు వచ్చిన ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ కుర్రాళ్లు ఈ బ్యూటీకి హారతి ఇచ్చి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడీ ముద్దుగుమ్మ తెలుగులో ఆఫర్స్ అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

అలాగే సోషల్ మీడియాలో ఈ బ్యూటికి సంబంధించిన ప్రతి పోస్ట్ తెగ వైరలవుతుంది. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా మమితాకు సంబంధించి చైల్డ్ హుడ్ ఫోటోస్, త్రోబ్యాక్ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అలాగే మమితా కాలేజీ డేస్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఇదివరకే కాలేజీలో మమితా చేసిన డాన్స్ వీడియోస్ తెగ వైరలైన సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియోను ఆమె ఫ్యాన్ పేజేస్ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో చూస్తుంటే మమితా కాలేజీ రోజుల్లో డాన్స్ చేసిన వీడియోగా కనిపిస్తుంది. అందులో హిందీ పాటకు మమితా మాస్ స్టైల్లో డాన్స్ అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మమితా బైజు సూపర్ శరణ్య సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ చిత్రంలో సోనారే పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. అలాగే మలయాళంలో హనీబీ 2, డాకిని, వరతన్, వికృతి, కిలోమీటర్లు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తమిళంలో, తెలుగులో అవకాశాలు అందుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. తెలుగు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టులో మమితా ఎంపికైనట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి