AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Telangana - Theater: సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూట‌ర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్

Telangana - Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..
Shiva Prajapati
|

Updated on: Dec 31, 2021 | 9:33 PM

Share

Telangana – Theater: సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూట‌ర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ సునిల్ నారంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశంపై శుక్రవారం నాడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘సినిమా టికెట్ రేట్ల విధానంపై ప్రభుత్వం విడుద‌ల చేసిన జీవోనెం120 అంద‌రికీ ఆమోద యోగ్యంగా ఉంది. ఈ సంద‌ర్భంగా మా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ త‌రుపున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి, కేటీఆర్‌గారికి, సినిమాటోగ్రఫి మంత్రులు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ గారికి ధ‌న్యవాదాలు తెలుపుతున్నాం. చిన్న సినిమాలు 50 -150 రూపాయ‌ల వ‌ర‌కూ టికేట్ రేటుకి అమ్ముకోవ‌చ్చు. నిర్మాత‌లంద‌రినీ విజ్ఞప్తి చేస్తున్నాం అధిక ద‌ర‌ల‌కు టికెట్లు విక్రయించ‌కూడ‌దు. ఈ రోజు కొన్ని థియేట‌ర్స్‌లో టికెట్ రేట్లు ఎక్కువ రేటుకి అమ్మడం మా దృష్టికి వ‌చ్చింది. మేం వెంట‌నే స్పందించి ఆ రేట్లను స‌వ‌రించి మిగ‌తా డ‌బ్బుని వారి ఎకౌంట్స్‌కి రీఫండ్ చేయ‌డం జ‌రిగింది. మాకు ప్రేక్షకుల సౌక‌ర్యాలే ముఖ్యం. ప్రస్తుతం నిర్మాత‌ల‌కు మ‌రియు డిస్ట్రిబ్యూట‌ర్లకు ఈ విధానం గురించి అవ‌గాహ‌న క‌లిపిస్తున్నాం. మీడియా స‌హ‌కారంతో ఈ జీవోపై మ‌రింత మందికి అవగాహ‌న వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాం. కొన్ని థియేట‌ర్స్ క్యాంటిన్ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వాటిని కూడా స‌వ‌రించే దిశ‌గా ప్రయ‌త్నాలు మొద‌లుపెట్టాం.’’ అని అన్నారు.

తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ సెక్రట‌రీ అనుప‌మ్ రెడ్డి మాట్లాడుతూ ‘‘గ‌వ‌ర్నమెంట్ ఇటీవ‌ల జీవో నెం 120ని విడుద‌ల‌చేసింది. ప్రతి ఒక్క సినిమాకు లాభం జ‌ర‌గాలి అనేదే ఆ జీవో సారాంశం. అందులో మినిమం, మ్యాగ్జిమం రేట్లను నిర్ణయించారు. చిన్న సినిమాలు మినిమం రేట్లకు, మీడియం సినిమాలు మొద‌టి వారం రోజులు మ్యాగ్జిమం రేట్లకు అమ్మాలి. త‌ర్వాత మినిమం రేటుకు అమ్మాలి. పెద్ద సినిమాలు మొద‌టి రెండు వారాలు మ్యాగ్జిమం త‌ర్వాత మినిమం రేట్లకు అమ్మాలి. ఈ రేట్లు అన్ని ప‌న్నుల‌తో స‌హా ఉంటాయి’’ అన్నారు.

తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ వైస్ ప్రెసిడెంట్ బాల‌గోవింద్‌ రాజ్‌ మాట్లాడుతూ.. ‘‘జీవో120 అనేది అంద‌రూ ఆహ్వానించ‌ద‌గినది. గ‌త ఐదారు సంవ‌త్సరాలుగా ఇవే రేట్లు మేము కోర్టు ద్వారా తెచ్చుకోవ‌డం జ‌రిగింది. ఈ జీవోను త‌ప్పకుండా పాటించే విధంగా ఛాంబ‌ర్ నిర్ణయం తీసుకుంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఇత‌ర స‌భ్యులు కూడా పాల్గొన్నారు.

Also read:

Metro Station: అధికారుల వినూత్న ప్రయత్నం.. మెట్లే ఎక్కుతామంటున్న ప్రయాణికులు.. ఎందుకో ఓ లుక్కేయండి..!

NEET PG Counselling: మెడికోలకు గుడ్‌న్యూస్.. నీట్ పీజీ కౌన్సెలింగ్ జనవరి 6 లోపు జరుగొచ్చు..

సీరియల్‌కి అయినా ముగింపు ఉంటుందేమో గానీ.. ఆ రోడ్డుకు మాత్రం శుభం కార్డు పడేలా లేదు..!

Follow Us
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!