AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangarraju: కొత్త సంవత్సరం కానుకగా బంగార్రాజు టీజర్.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్.

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బంగార్రాజు. ఇందులో నాగార్జున

Bangarraju: కొత్త సంవత్సరం కానుకగా బంగార్రాజు టీజర్.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్.
Bangarraju
Rajitha Chanti
| Edited By: Rajeev Rayala|

Updated on: Jan 01, 2022 | 3:28 PM

Share

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బంగార్రాజు. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సిక్వెల్‏గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నూత‌న సంవ‌త్స‌రం రోజున ఉదయం 11 గంటల 22 నిమిషాలకు బంగార్రాజు టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్లో తండ్రీ కొడుకులు – నాగార్జున, నాగ చైతన్య మీసాలు తిప్పుతూ హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్నారు. నాగార్జున పంచెక‌ట్టులో నాగ‌చైత‌న్య స్టైలీష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వ‌హిస్తున్న‌ ఈ మూవీ 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో వ‌చ్చిన పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య అనే పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. నాగార్జున, నాగ చైతన్య కలిసి ఇందులు స్టెప్పులు వేయగా.. ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

Also Read:Vishwak Sen: కరోనా భారిన పడ్డ పాగల్ హీరో.. క్యారంటైన్‏లో ఉన్నానంటూ ట్వీట్ చేసిన విశ్వక్ సేన్..

Samantha: అలాంటి పాత్రలు చేసి అలసిపోయాను.. వాళ్లే ఆ ఆలోచన మార్చారు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..

Ilayaraja: వీడియోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన ఇళయరాజా.. పాటతో న్యూఇయర్ జోష్ నింపిన మ్యాజిక్ మేస్ట్రో..

RRR : ఆర్ఆర్ఆర్ టైటిల్ పెట్టడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పేసిన జక్కన్న..