Samantha: అలాంటి పాత్రలు చేసి అలసిపోయాను.. వాళ్లే ఆ ఆలోచన మార్చారు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..

సమంత గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టవ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ..

Samantha: అలాంటి పాత్రలు చేసి అలసిపోయాను.. వాళ్లే ఆ ఆలోచన మార్చారు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..
మాతృత్వం గురించి సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 31, 2021 | 3:52 PM

సమంత గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టవ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ.. మూవీ అప్డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్‏లో ఉంటుంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం కొద్ది రోజులుగా నిశ్శబ్ధంగా ఉన్న సామ్.. తన పై వస్తున్న రూమర్స్‏పై స్పందిస్తూ.. మళ్లీ తన కెరీర్‏పై దృష్టిపెడుతోంది. ప్రస్తుతం సామ్..వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తూ బిజీగా ఉంటోంది. ఇటీవల అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప మూవీలో స్పెషల్ సాంగ్‏తో ఆకట్టుకుంది సమంత. ఇప్పుడు సామ్ నటించిన ఊ అంటావా మావా.. ఊహు అంటావా మావా సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల సమంత తన లైఫ్ గురించి.. తను విడాకులు తీసుకున్న తర్వాత ఎదుర్కొన్న మానసిక పరిస్థితి గురించి పలు ఇంటర్యూలలో బయటపెట్టింది. తాజాగా మరోసారి తన కెరీర్, రోల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సామ్. పాన్ ఇండియా లెవల్లో ఫాలోయింగ్ అందుకున్ సమంత ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవల ఓ హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. వెబ్ సిరీస్ చేయాలన్న ఆలోచన అప్పటివరకు లేదు. కానీ రాజ్, డీకే నా ఆలోచనల్లో మార్పులు తెచ్చారు. కుదరదు అని చెప్పకూడదని నిర్ణయించుకున్నా.. రాజీ పాత్రకు నేను ఊహించినదానికంటే ఎక్కువే అబినందనలు దక్కాయి. ఈ సిరీస్ తో కొత్త సవాళ్లను స్వీకరించగలననే నమ్మకం ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే గ్లామర్ పాత్రల గురించి స్పందిస్తూ ఇప్పటివరకు అందానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి అలసిపోయాను. ఇక పై రోల్స్ చేయడానికి నేను సమర్ధురాలిని కాదని నమ్ముతున్నా. నటిగా ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది సామ్. దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకు మంచి గుర్తింపు లభించిందని.. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లాలనే ఆలోచన చేయలేదని.. గత రెండేళ్లలో పరిస్థితులలో చాలా మార్పులొచ్చాయని తెలిపింది. ప్రస్తుతం సమంత యశోద సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తోంది.

Also Read: Pushpa Deleted Scene: సీన్ అదిరిపోయింది ఎందుకు తీసేశారబ్బా..! పుష్ప డెలిటెడ్ సీన్..

Ram Charan: శంకర్‌ సినిమాకు రామ్‌చరణ్‌ రెమ్యునరేషన్‌ రూ.100 కోట్లు..? క్లారిటీ ఇచ్చేసిన చెర్రీ..

ముసిముసి నవ్వులతో ముద్దులొలుకుతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టండి చుద్దాం..

Vijay Devarakonda’s Liger: ఛాయ్ వాలా టు బాక్సర్… అదిరిపోయిన విజయ్ దేవరకొండ లైగర్ గ్లిమ్ప్స్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?