AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముసిముసి నవ్వులతో ముద్దులొలుకుతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టండి చుద్దాం..

స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే గ్లామర్ ఉంటే సరిపోదు..ఎంతోకంత టాలెంట్ ఉండాలి. అందం అభినయం కలగలిపిన ముద్దుగుమ్మల్లో ఈ వయ్యారి భామ కూడా ఒకరు.

ముసిముసి నవ్వులతో ముద్దులొలుకుతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టండి చుద్దాం..
Rajeev Rayala
|

Updated on: Dec 31, 2021 | 11:29 AM

Share

స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే గ్లామర్ ఉంటే సరిపోదు..ఎంతోకంత టాలెంట్ ఉండాలి. అందం అభినయం కలగలిపిన ముద్దుగుమ్మల్లో ఈ వయ్యారి భామ కూడా ఒకరు. నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో ఈ అమ్మడు దిట్ట అనే చెప్పాలి. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకుంది ఈ బ్యూటీ. పై ఫొటోలో బెలూన్స్ తో ఆడుకుంటూ.. ముసిముసి నవ్వులు పూయిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా తెలుగు సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది ఈ బ్యూటీ. ఈ ఫొటోలోని చిన్నది కళ్ళతోనే భావాలను పలికించగల నటి. ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరంటే..

మణిరత్నం తెరకెక్కించిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది వయ్యారి భామ అదితిరావ్ హైదరి. అంతకు ముందు పలు హిందీ, తమిళ్ సినిమాల్లో నటించినా.. చెలియా సినిమ తెలుగులో కూడా డబ్ అవ్వడంతో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత తెలుగులో సమ్మోహనం సినిమాలో నటించింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత రీసెంట్ గా మహాసముద్రం సినిమాలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. కేవలం తెలుగు సినిమాలోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడి చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?
గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?
అల్లరి నరేశ్ ఇంట తీవ్ర విషాదం..
అల్లరి నరేశ్ ఇంట తీవ్ర విషాదం..