Ilayaraja: వీడియోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన ఇళయరాజా.. పాటతో న్యూఇయర్ జోష్ నింపిన మ్యాజిక్ మేస్ట్రో..

సంగీతంతో కోట్లాది మంది శ్రోతలను ఆకట్టుకున్నారు ఇళయరాజా. సామాన్యుడి నుంచి పండితుడి వరకు.. అందరినీ తన

Ilayaraja: వీడియోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన ఇళయరాజా.. పాటతో న్యూఇయర్ జోష్ నింపిన మ్యాజిక్ మేస్ట్రో..
Ilayaraja
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 31, 2021 | 3:32 PM

సంగీతంతో కోట్లాది మంది శ్రోతలను ఆకట్టుకున్నారు ఇళయరాజా. సామాన్యుడి నుంచి పండితుడి వరకు.. అందరినీ తన సంగీతంతో పరవశింపజేసిన ఇళయరాజా..వెండితెరపై ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని.. పలువురు సెలబ్రెటీలకు సంబంధించిన విషయాలతోపాటు.. వారి గురించి అసత్యపు వార్తలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖుల ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. మంచనా పడ్డారని ఇలా రకరకాల వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో కింగ్ ఆఫ్ మెలోడి, మ్యూజిక్ మ్యాస్ట్రో ఆరోగ్య పరిస్థితి గురించి కూడా రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. గత కొద్ది రోజులుగా ఇళయరాజా ఎక్కువగా బయటకు కనిపించడం లేదు. దీంతో ఆయన ఆరోగ్యం విషమించిందని.. ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులు వార్తలు వచ్చాయి.

ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా ఆరోగ్యం విషమించింది! ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.! వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు! చికిత్సకు ఏమాత్రం స్పందించడం లేదు! ఇవి గత కొంతకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు.. అయితే వాటినన్నింటిని ఒక్క వీడియోతో పటాపంచలు చేశారు మ్యూజిక్ మేస్ట్రో ఇళయారాజా..! తన స్టైల్లో పాట పాడుతూ.. రెట్టింపు ఉత్తాహంతో తన అభిమానులకు న్యూ ఇయర్ విషెష్ చెబుతూ.. తాజాగా వీడియో రిలీజ్‌ చేశారు. తన ఆరోగ్యం బానే ఉందని.. ఎంతో ఉత్సాహంతో ఉన్నానని.. అభిమానులు అధైర్యపడొద్దని ఆ పాటతోనే చెప్పాశారు ఇళయరాజా..! అంతే కాదు ఈ వీడియోతో తన అభిమానులను ఖుషీ చేశారు. ప్రస్తుతం ఇళయరాజాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Pushpa Deleted Scene: సీన్ అదిరిపోయింది ఎందుకు తీసేశారబ్బా..! పుష్ప డెలిటెడ్ సీన్..

Ram Charan: శంకర్‌ సినిమాకు రామ్‌చరణ్‌ రెమ్యునరేషన్‌ రూ.100 కోట్లు..? క్లారిటీ ఇచ్చేసిన చెర్రీ..

ముసిముసి నవ్వులతో ముద్దులొలుకుతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టండి చుద్దాం..

Vijay Devarakonda’s Liger: ఛాయ్ వాలా టు బాక్సర్… అదిరిపోయిన విజయ్ దేవరకొండ లైగర్ గ్లిమ్ప్స్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?