NEET PG Counselling: మెడికోలకు గుడ్‌న్యూస్.. నీట్ పీజీ కౌన్సెలింగ్ జనవరి 6 లోపు జరుగొచ్చు..
NEET PG కౌన్సెలింగ్ 2021 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అని చెప్పవచ్చు. NEET PG 2021 అడ్మిషన్ కోసం కౌన్సెలింగ్ 06 జనవరి 2022 లోపు..
NEET PG Counselling 2021 Schedule latest news: NEET PG కౌన్సెలింగ్ 2021 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అని చెప్పవచ్చు. NEET PG 2021 అడ్మిషన్ కోసం కౌన్సెలింగ్ 06 జనవరి 2022 లోపు ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య హామీ ఇచ్చారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రెసిడెంట్ సహజానంద్ ప్రసాద్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సమ్మె చేస్తున్న జూనియర్ వైద్యులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఐఎంఏ కేంద్ర ఆరోగ్య మంత్రి, హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైద్యులపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబోమని హామీ ఇచ్చినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలిపారు.
ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు సహజానంద్ ప్రసాద్ సింగ్ 30 డిసెంబర్ 2021న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాతో పాటు ఇతర సభ్యులతో సమావేశమయ్యారు. మెడికల్ పీజీ కోర్సుల్లో అడ్మిషన్లలో జాప్యాన్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వైద్యుల శాంతియుత నిరసనపై పోలీసుల చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Health Minister has assured us that the NEET-PG counseling will start before 6th Jan’2022. There will be no FIRs on the doctors. There is no need to panic for the new variant of Covid, but all precautions should be taken: Sahajanand Prasad Singh, IMA President pic.twitter.com/QUgN2ePP0G
— ANI (@ANI) December 31, 2021
కోవిడ్ మహమ్మారి కారణంగా నిరంతరం జాప్యం జరుగుతోందని.. ఏడాదికి పైగా మెడికల్ పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం వేలాది మంది వైద్యులు ఎదురుచూస్తున్నారని ఐఎంఏ అభ్యర్థించింది. Omicron వేరియంట్ కారణంగా కరోనా మూడవ వేవ్ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితిలో ఆసుపత్రులలో వైద్య సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగడం విచారకరమన్నారు. అది కూడా NEET PG పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు సమ్మె సరికాదన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వైద్య సేవకు తన పూర్తి సహకారం అందిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి: Hyderabad Drug Racket: న్యూ ఇయర్ గ”మ్మత్తు”పై నిఘా కన్ను.. వాటిపైనే టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఫోకస్..
Good News: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. న్యూ ఇయర్ కానుకగా బ్రాండెడ్ మద్యం..