Hyderabad Drug Racket: న్యూ ఇయర్ గ”మ్మత్తు”పై నిఘా కన్ను.. వాటిపైనే టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఫోకస్..
న్యూ ఇయర్ వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా చెలరేగిపోనుందా? ఇప్పటికే భారీ స్థాయిలో డ్రగ్స్ నగరానికి చేరిపోయాయా? వీటన్నింటికి అవుననే సంకేతాలు వస్తున్నాయి. వేడుకల్లో భారీ స్థాయిలో డ్రగ్స్ వినియోగం..
న్యూ ఇయర్ వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా చెలరేగిపోనుందా? ఇప్పటికే భారీ స్థాయిలో డ్రగ్స్ నగరానికి చేరిపోయాయా? వీటన్నింటికి అవుననే సంకేతాలు వస్తున్నాయి. వేడుకల్లో భారీ స్థాయిలో డ్రగ్స్ వినియోగం జరుగనున్నట్లు.. పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్ పెడ్లర్ల కదలికలు బయట పడటంతో వాటికి చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగాయి టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలు. న్యూ ఇయర్ పార్టీ.. మందు.. చిందు.. విందుకు జోష్‌ఫుల్ వేడుక. ఈ సరదా సమయంలో మత్తు తోడైతే.. మజా మరింత పెరుగుతుంది. గమ్మత్తైన అనుభూతిని యువతకు పంచేందుకు కొత్త సంవత్సర వేడుకలు వేదికగా డ్రగ్స్ మాఫియా రంగంలోకి దిగుతోంది. ఈవెంట్ నిర్వాహకుల సహకారంతో కొన్ని చోట్ల డ్రగ్స్ విక్రయాలు జరగనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వారికి సమాచా రం లేకుండా రహస్యంగా అమ్మేందుకు వ్యూహాలు రచిస్తోంది డ్రగ్స్ మాఫియా. సరదా సమయంలో మత్తు తోడైతే..
డ్రగ్స్ కదలికలపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్ అధికారులు కీలక సమాచారంతో ఇప్పటికే పార్టీల నిర్వహించే చోట డంప్ చేసిన నైజరీయన్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తే కీలక విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ఈవెంట్ అర్గనైజర్లతో కలిసి పార్టీలు జరిగే చోట డ్రగ్స్ ను సప్లయి చేస్తున్నట్టు గుర్తించారు. వీరి వద్ద నుండి 183గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక బాలానగర్ పరిధిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి మరికొన్ని డ్రడ్స్ సీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి: Happy New Year 2022: అందరికంటే ముందే మేమొచ్చాం.. 2022లోకి తొలి అడుగుపెట్టిన దేశం ఇదే..
Tadikonda MLA Sridevi: మాదిగలకు హక్కులు ఆయన వల్లే రాలేదు.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి