Happy New Year 2022: అందరికంటే ముందే మేమొచ్చాం.. 2022లోకి తొలి అడుగుపెట్టిన దేశం ఇదే..

సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.. న్యూ ఇయర్‌ వేడుకలు ఆడంబరంగా సాగుతున్నాయి. న్యూజిలాండ్‌ ఆక్లాండ్‌ వాసులు అప్పుడే న్యూ ఇయర్‌లోకి అడుగుపెట్టేశారు. మధుర జ్ఞాపకాల్ని..

Happy New Year 2022: అందరికంటే ముందే మేమొచ్చాం.. 2022లోకి తొలి అడుగుపెట్టిన దేశం ఇదే..
Auckland New Year
Follow us

|

Updated on: Dec 31, 2021 | 5:24 PM

New Year 2022 Celebrations : సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.. న్యూ ఇయర్‌ వేడుకలు ఆడంబరంగా సాగుతున్నాయి. న్యూజిలాండ్‌ ఆక్లాండ్‌ వాసులు అప్పుడే న్యూ ఇయర్‌లోకి అడుగుపెట్టేశారు. మధుర జ్ఞాపకాల్ని మదిలో దాచుకుంటూ 2021కి గుడ్‌బై చెప్పిన ఆక్లాండ్‌ వాసులు.. కోటి ఆశలతో 2022కి స్వాగతం చెప్పారు. ప్రపంచంలో అందరికంటే ముందే నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. వీరికంటే ముందే పసిఫిక్ మహా సముద్రంలోని సమోవా, టోంటా, కిరిబాటి దీవుల్లో నూతన సంవత్సర వేడుకల సందడికి శ్రీకారం చుట్టారు. దాదాపు గంట తర్వాత న్యూజిలాండ్ ప్రజలు కొత్త ఏడాదిని ఆహ్వానించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్ కొత్త ఏడాదిలో అడుగుపెట్టింది.

భారత్ కంటే ఐదున్నర గంటల ముందుగా ఆస్ట్రేలియా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంది. ముఖ్యంగా సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్దకు లక్షలాది మంది చేరుకుని న్యూఇయర్ వేడుకల అంబరాన్నంటేలా జరుపుకుంటారు. జపాన్ సైతం మనకంటే మూడు గంటలు ముందే 2022లోకి అడుగుపెట్టింది. ఇక భారతదేశం కంటే నాలుగున్నర గంటలు ఆలస్యంగా 43 దేశాలు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి.

ఇక్కడి ఛాధమ్ దీవులు, రాజధాని అక్లాండ్‌లో అర్థరాత్రి 12 గంటలు కావడంతో అక్కడి ప్రజలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పెద్ద సంఖ్యలో క్రాకర్స్ కాల్చి సందడి చేస్తున్నారు.  పరస్పరం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అక్లాండ్ వాసులు ఘనంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఆస్ట్రేలియాలోను కొత్త సంవత్సరం వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. సిడ్నీలో అట్టహాసంగా నిర్వహించారు.

ఇలా వరుసగా ప్రపంచంలోనే తొలుత అక్లాండ్‌లో కొత్త ఏడాది 2022 వచ్చింది. ఆ తర్వాత వరుసగా సిడ్నీ, టోక్యో, బీజింగ్-హాంగ్‌కాంగ్, దుబాయి, ప్యారిస్ – రోమ్-బ్రసెల్స్, లండన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్‌లలో కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది.

ఇవి కూడా చదవండి: Tadikonda MLA Sridevi: మాదిగలకు హక్కులు ఆయన వల్లే రాలేదు.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి

Green Coriander Benefits: పచ్చి కొత్తిమీరను తినేవారు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే.. ఏంటంటే..

Latest Articles