Green Coriander Benefits: పచ్చి కొత్తిమీరను తినేవారు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే.. ఏంటంటే..
కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. అలాగే కంటి సమస్యలు తగ్గుతాయంటారు.
కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. అలాగే కంటి సమస్యలు తగ్గుతాయంటారు. సాధారణంగా కొత్తిమీరను వంటకాలలో రుచి కోసం ఉపయోగిస్తుంటాం. కేవలం రుచి మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అలాగే కొత్తిమీరతో అనేక ప్రయోజనాలుంటాయి.
పచ్చి కొత్తిమీర కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. రోజూ దీనిని తినడం వలన కంటి చూపు బాగుండడమే కాకుండా కళ్లలో నొప్పి సమస్య కూడా తగ్గుతుంది. శరీర పోషణలో పచ్చి కొత్తిమీర ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పచ్చి కొత్తిమీర తినడం వనల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఇది వైరస్, ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది. పచ్చి కొత్తిమీర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజూ కొత్తిమీరను తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే గ్యాస్, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పచ్చి కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీన్ని తినడం వలన మధుమేహం వచ్చే ప్రమాధం తగ్గుతుంది. అలాగే ఇది డయాబెటిక్ రోగులకు ఎలాంటి హాని కల్గించదు. నొటి దుర్వాసన పోగొట్టుకోవడానికి ధనియాలు సహాయపడతాయి. అలాగే కొత్తిమీర నొటి పుళ్లను పోగొడుతుంది.
Also Read: Pushpa Deleted Scene: సీన్ అదిరిపోయింది ఎందుకు తీసేశారబ్బా..! పుష్ప డెలిటెడ్ సీన్..
Ram Charan: శంకర్ సినిమాకు రామ్‌చరణ్ రెమ్యునరేషన్ రూ.100 కోట్లు..? క్లారిటీ ఇచ్చేసిన చెర్రీ..
ముసిముసి నవ్వులతో ముద్దులొలుకుతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టండి చుద్దాం..
Vijay Devarakonda’s Liger: ఛాయ్ వాలా టు బాక్సర్… అదిరిపోయిన విజయ్ దేవరకొండ లైగర్ గ్లిమ్ప్స్